twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Top 5 Telugu songs on YouTube: మరోసారి సాయి పల్లవి నెంబర్ 1.. డిజాస్టర్ సినిమా పాట టాప్ 3లో..

    |

    ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా విడుదలైన కూడా ముందుగా పాటలు సక్సెస్ అయితేనే సినిమాలకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి అనేది కూడా బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తున్నాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా ముందుగా సాంగ్స్ అనేది చాలా ప్రధానం గా మారుతున్నాయి. ఒక విధంగా సంగీత దర్శకులకు ఒక పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. ఇక ఈ ఏడాది అత్యధిక వ్యూవ్స్ అందుకున్న సాంగ్స్ లిస్ట్ లోకి వెళితే...

    నెంబర్ వన్ లో సాయి పల్లవి

    శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందే సినిమాలోని సారంగదరియా పాట రికార్డు స్థాయిలో వ్యూవ్స్ అందుకోవడం విశేషం. ఎక్కువగా సాయి పల్లవి క్రేజ్ ఉపయోగపడింది అనే చెప్పాలి. ఇక ఈ ఏడాది అత్యధిక వ్యూస్ అందుకున్న పాటలలో సారంగదరియా 352 మిలియన్ల వ్యూవ్స్ తో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. రెహమాన్ శిష్యుడు పవన్ స్వరపరిచిన ఈ సాంగ్ ను మంగ్లీ పాడింది.

    బుల్లెట్ బండి..

    యూట్యూబ్ లో ప్రస్తుతం స్టార్ హోదాతో సంబంధం లేకుండా పాటలు బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఇష్టపడుతున్నారు. ఎవరు పాడారో తెలియక పోయినా కూడా పాట మాధుర్యం బాగుంటే ఈజీగా యూట్యూబ్లో వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటున్నాయి. ఆ లిస్టులో ప్రైవేట్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రముఖ సింగర్ మోహన భోగరాజు ఆడి పాడిన బుల్లెట్ బండి పాట కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ప్రతి పెళ్లి వేడుకలో కూడా ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వ్యూవ్స్ అందుకుని 175 మిలియన్ల వ్యూవ్స్ ఈ పాట రెండో స్థానంలో నిలిచింది.

    ఒకే ఒక లోకం..

    ఇక సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి క్రేజ్ అందుకున్న పాటలు కూడా ఉన్నాయి. అందులో ఆది సాయి కుమార్ శశి సినిమా లోని ఒకే ఒక లోకం పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోయినా కూడా సిద్ శ్రీరామ్ పాడిన పాట యూట్యూబ్ లో 150 మిలియన్ల వ్యూవ్స్ అందుకుని టాప్ 3లో నిలిచింది. అరుణ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.

    శ్రీవల్లి టాప్ 4

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరపైకి వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట దాదాపు అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఈ పాట తెలుగులో ఈజీగా 111 మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. దీంతో సినిమాకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట సిద్ శ్రీరామ్ పాడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది అత్యదిక వ్యూవ్స్ అందుకున్న పాటగా ఇది 4లో నిలిచింది.

    టాప్ 5లో మెగాస్టార్

    టాప్ 5లో మెగాస్టార్ ఆచార్య సినిమా పాట కూడా ఒక స్థానాన్ని సంపాదించుకుంది. ఈసారి అత్యధికంగా యూట్యూబ్ లో వ్యూవ్స్ అందుకున్న పాటలలో లాహే లాహే 105 మిలియన్ల వ్యూవ్స్ తో 5వ స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులతో మరోసారి ఆకట్టుకోవడంతో పాటకు అందం వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను యువ గాయనిలు హారిక నారాయణ సాహితి చాగంటి ఆలపించారు.

    English summary
    Top 5 Telugu songs on YouTube 2021 sai pallavi another record..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X