అరవింద సమేత ఆడియో అప్డేట్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తొలిసారి ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. అభిమానులని ఉక్కిరి బిక్కిరి చేసే ఇలాంటి విశేషాలెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి.
అక్టోబర్ 11 న అరవింద సమేత చిత్రం దసరా కానుకగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఏ చిత్ర ఆడియో గురించి ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 20 న ఆడియోని నేరుగా మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా అక్టోబర్ మొదటి వారంలో నిర్వహిస్తారట. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











