UI చంద్రబాబు, పవన్, జగన్, షర్మిలను ఉతికి పారేస్తున్న పాట.. టాప్ ట్రెండింగ్ పాటను మీరు విన్నారా?

దేశంలో ప్రతీ ఒక్కరిని ఎలక్షన్ ఫీవర్ వెంటాడుతున్నది. ఎన్నికల వస్తున్నాయనే విషయంతో వేసవి కంటే ముందే వాతావరణం వేడెక్కింది. దాంతో సినీ పరిశ్రమలో కూడా ఎన్నికల వాతావరణాన్ని వాడుకోవడం మొదలైంది. ఎన్నికల ప్రసంగాలను, రాజకీయ నేతలు చేసే స్పీచ్‌లోని హుక్ ట్యాగ్స్ తీసుకొని రూపొందించిన ఓ పాట సోషల్ మీడియాను కుదిపేస్తున్నది. ఈ పాటలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలను, సినీ తారలను టార్గెట్ చేస్తూ సినీ రచయిత రాసిన పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వెళ్లింది. ఆ పాట ఏంటి? ఆ పాటను ట్రెండింగ్‌గా మార్చిన అంశాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలో సంచలన నటుడు, దర్శకుడు ఉపేంద్ర సంధించిన తాజా చిత్రం యూఐ (UI). గతంలో A, ఉపేంద్ర లాంటి చిత్రాలతో తెలుగు సంచలన విజయాలు సాధించిన ఆయన తాజాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్రతోపాటు రీష్మా నన్నయ్య, సన్నీలియోన్, జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, ఇంద్రజిత్ లోకేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Upendra s UI Movie Song Top trending Which had lyrics on Chandrababu Pawan Kalyan YS Jagan Sharmila

అయితే యూఐ (UI) సినిమా కోసం రాసిన పాట ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో వాడిన మనల్నెవడురా ఆపేది.. నేను ఉన్నానంటూ.. ముద్దులు ఇచ్చే వైఎస్ జగన్ అంటూ.. కుర్చి మడతపెట్టి అంటూ చంద్రబాబు ఇటీవల వాడిన డైలాగ్స్, అలాగే పాలు, పూలు అమ్మిన మల్లారెడ్డి సెన్సేషనల్ డైలాగ్స్‌ ఈ పాటను క్రేజీగా మార్చాయి.

ఈ పాటలో అంతటితో ఆగలేదు. షర్మిల పాదయాత్ర వైరల్ కంటెంట్ గురించి.. ఏవోవో అనుకొంటాం.. అన్నీ అవుతాయా? అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ను పాట కోసం వాడుకోవడం క్రేజీగా మారింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హుక్ డైలాగ్.. రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎక్కడికో వెళ్తా అంటూ త్రివిక్రమ్ మాటలు, వర్త్ వర్మ అంటూ ఇటీవల క్రేజీగా మారిన డైలాగ్స్‌లో పాటలో పొందుపరిచారు. అలాగే అల్లు అర్జున్ జై బాలయ్య అంటూ చెప్పిన డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

యూఐ సినిమాలోని ఈ పాటలో ఇంకా ఎన్ని విశేషాలు ఉన్నాయి. గత రెండు రోజుల్నించి ఈ పాట ట్రెండింగ్‌గా మారింది. సోషల్ మీడియాలో మీమర్స్‌, ట్రోలర్స్ ఈ పాటను ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ లభిస్తున్నది.

యూఐ సినిమా విషయానికి వస్తే.. వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ మూవీని జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ నిర్మించారు. ఈ సినిమాకు ఉపేంద్ర స్వయంగా దర్శకత్వం వహించారు. వేణుగోపాల్ హెచ్ సీ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ రాజ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X