ఉప్పెన ఫస్ట్ సింగిల్.. ఇంట్రెస్టింగ్ ప్రోమో
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ఉప్పెన. ఇది ఇక్కడి వరకే అయితే కొంత వరకు బజ్ క్రియేట్ అవుతుంది. ఆ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడంటే మరింత హైప్ క్రియేట్ అవుతుంది. అదే ఆ సినిమాతో మెగా వారసుడు వస్తున్నాడంటే అందరి కళ్లు దానిపైనే ఉంటాయి.
అందుకు ఉప్పెన నుంచి ఏ చిన్న అప్‌డేట్ వదిలినా.. దాంట్లో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చినవే ఉప్పెన పోస్టర్స్, ఫస్ట్ లుక్, ఫస్ట్ వేవ్, ఇలా ఏదైనా సరే.. అన్నింటిని కొత్తగా ప్లాన్ చేస్తూ వచ్చారు. మొదటి పాట రాబోతోందంటూ.. తాజాగా వదిలిన ప్రోమో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పాట కంపోజింగ్ గురించి బుచ్చిబాబు, దేవీ ముచ్చటించుకుంటున్నారు. మొదటి సాంగ్ గురించి డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. ఈ పాటను మొత్తం ప్రేమతో నింపేయండని డైరెక్టర్ కోరగా.. సిట్యువేషన్‌ను వివరిస్తాడు. దాంతో ఓ ట్యూన్ వచ్చిందని చూపించడం ఇలా ఇంట్రెస్టింగ్‌గా ప్రోమోను కట్ చేశారు. ఏప్రిల్ 2న రాబోతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











