ప్రిన్స్ డయానా స్పూర్తితో ఊర్వశీ రౌటేలా.. మ్యూజిక్ ఆల్బమ్‌కు అనూహ్య స్పందన

బాలీవుడ్, టాలీవుడ్‌లో ఆకట్టుకొంటున్న ఊర్వశీ రౌటేలా తాజాగా అందం, అభినయంతో హల్‌చల్ చేస్తున్నది. ఇటీవల రిలీజైన మ్యూజిక్ వీడియో తేరి లోడ్ వే‌కు మంచి స్పందన వ్యక్తమవుతున్న సమయంలో బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఫ్యాషన్ అంటే తనకు ప్రాణమని అంటూ వెల్లడించింది. బాలీవుడ్‌లో ప్రముఖ మ్యాగజైన్ ఎక్స్‌పిడిషన్ కవర్‌పిక్‌ కోసం ఫోటోషూట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ప్రముఖ మ్యాగజైన్ ఎక్స్‌పిడిషన్ కవర్‌పిక్‌ కోసం ధరించిన హిప్ హై స్లిట్ బ్లాక్ గౌన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఆమె ధరించిన గౌన్ దివంగత ప్రిన్సెస్ డయానాను స్పూర్తి పొంది డిజైన్ చేసిందని తెలిపారు. భవిష్యత్‌లో నా అభిమానులు, ప్రేక్షకులను ఆనందంలో ఉంచేందుకు ప్రయత్నిస్తాను. అవకాశం వస్తే భవిష్యత్‌లో డిస్నీ ప్రిన్సెస్ పాత్రను పోషించడానికి ప్రయత్నిస్తున్నాను. లేడి డయానాగా నటించాలని ఉంది అన్నారు.

Urvashi Rautela’s new look inspired by Princess Diana for Teri Load Ve album

ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల్లో తన పాత్రలు మంచి పేరు తెచ్చిపెడుతాయి. ఛాన్స్ వస్తే.. రియల్ ప్రిన్సెస్‌గా నటించాలన్నది నా కోరిక. బాలీవుడ్ ప్రిన్సెస్‌గా మారాలన్నది నా అభిమతం అని ఊర్వశి రౌటేలా చెప్పారు.

కెరీర్ పరంగా ఊర్వశి రటేలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బీట్ పే తుమ్కా అనే డ్యాన్స్ ఆల్బమ్‌తో ముందుకు వచ్చారు. ఇటీవల రిలీజైన ఆ ఆల్బమ్‌కు విశేష స్పందన వస్తున్నది. వర్జిన్ భానుప్రియ అనే కామెడీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాటలో కనిపించనున్నారు. ఇక సంపత్ నంది రూపొందిస్తున్న బ్లాక్ రోజ్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X