V అప్‌డేట్: ఆకట్టుకుంటున్న ''వస్తున్నా.. వచ్చేస్తున్నా'' సాంగ్ ప్రోమో
మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న విలక్షణ కథాంశం V. సింగల్ అక్షరంలో ఇలా ఆసక్తికర టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పైగా నాని కెరీర్‌లో ఇది ఓ డిఫెరెంట్ మూవీగా రానుందని వచ్చిన వార్తలు సినిమా పట్ల ఆతృతను పెంచేశాయి. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఆతృతకు రెక్కలు కట్టాయి.
ఈ చిత్రంలో చిత్రంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తుండగా.. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. నాని, సుధీర్ బాబు ఇంటెన్సివ్ లుక్స్ సినిమాపై ఆత్రుతను రెట్టింపు చేశాయి.
కాగా తాజా ఈ సినిమా నుంచి వస్తున్నా.. వచ్చేస్తున్నా సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 21 సెకనులతి కూడిన ఈ ప్రోమో వీడియోలో నివేదా థామస్, సుధీర్ బాబు, నాని కనిపించి ఆకట్టుకున్నారు. సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్, అమిత్ త్రివేది సంగీతం పాటకు ప్రాణం పోశాయి. ఫుల్ సాంగ్ వినాలనే కుతూహలం పెంచేశాయి.

నాని కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న 'V' మార్చి 25న విడుదల కానుంది. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందిస్తున్నారు. శిరీష్,లక్ష్మణ్,హర్షిత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశాలతో ముందుకెళ్తున్న నాని మొదటిసారి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్‌గా కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











