‘ఫిదా’ సాంగ్ సంచలన రికార్డ్... 150 మిలియన్స్!
వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శతక్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించి 'ఫిదా' మూవీ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. కేవలం సినిమా మాత్రమే కాదు... యూట్యూబ్‌లో ఈ మూవీ సాంగ్స్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
ఫిదాలోని.... "వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే..' పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం ఒక్క యూట్యూబ్‌లోనే ఇప్పటి వరకు 150 మిలియన్ల (15 కోట్లు) వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పాటకు ఇంత రెస్పాన్స్ రాలేదు. దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా.... మధుప్రియ, రాంకీ పాడారు. శర్తికాంత్ కార్తీక్ సంగీతం అందించారు.
తను దర్శకత్వం వహించిన సినిమాలోని ఈ పాటకు ఇంత ఆదరణ లభించడంపై శేఖర్ కమ్ముల ఫేస్ బుక్ ద్వారా రియాక్ట్ అయ్యారు. '150 మిలియన్ మార్క్‌ను దాటిన తొలి తెలుగు పాట ఇదే .. దీన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థాంక్స్. ఈ మ్యాజిక్‌లో భాగమైన 'ఫిదా' టీమ్ కి శుభాకాంక్షలు' అని ఆయన పోస్ట్ చేశారు.
'ఫిదా' చిత్రాన్ని అందమైన ప్రేమకథ చిత్రంగా శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అమెరికాలో సెటిలైన ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.



Click it and Unblock the Notifications











