Aadikeshava: మరోసారి డ్యాన్సుతో ఊపేసిన శ్రీలీల - పొట్టి డ్రెస్సు వేసుకొని వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్
Aadikeshava: మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తాజాగా రాబోతున్న చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పూర్తి స్థాయి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ కుర్రహీరో.. మొదటి సారి యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించడంతో సినిమాపై భారీ అంచనాలే నమోదు అయ్యాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించిన సిత్తరాల సిత్రావతి అనే పాట ఇప్పటికే విడుదల కాగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో వైష్ణవ్ తేజ్, శ్రీలీల డ్యాన్స్ అదిరిపోయింది. వారి డ్యాన్సుకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో పాటను విడుదల చేసిందీ చిత్రబృందం. హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సాంగ్ ను విడుదల చేశారు.

హేయ్ బుజ్జి బంగారం అంటూ సాగే ఈ పాటలోనూ హీరోహీరోయిన్లు డ్యాన్స్ ఇరగదీశారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఈ పాటను పాడారు. "హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా.. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత" అంటూ సాగుతున్న ఈ మెలోడీ పాటను విదేశాల్లో చిత్రీకరించారు. అదిరిపోయే స్టెప్పులతో శ్రీలీల మరోసారి అదరగొట్టింది. చిట్టి పొట్టి గౌనులు వేసుకొని సూపర్ గా డ్యాన్స్ చేసింది. వైష్ణవ్ తేజ్ కూడా అదిరిపోయే లుక్కులో కనిపించాడు. చాలా స్టైలిష్ గా భలేగా డ్యాన్స్ చేశాడు. ఈ పాట విడుదల చేసిన కాసేపట్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
ఈ సినిమా కథ మొత్తం.. మైనింగ్ కు అడ్డుగా ఉందనే ఉద్దేశంతో శివాలయాన్ని కూల్చడానికి విలన్ ప్రయత్నించడం, అందుకు హీరో అడ్డుకోవడం చుట్టూ ఉంటుందట. జోజు జార్జ్, అపర్ణ దాస్, రాధికలు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నారు. ఈ సినిమాను నవంబర్ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాతో జోజు జార్జ్, అపర్ణా దాస్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుండగా.. మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి వైష్ణవ్ తేజ్ సినిమా ఏ రేంజ్ లో హిట్టువుతుందనేది.


Click it and Unblock the Notifications











