Adikeshava: మెగా హీరోతో ఊపేసిన శ్రీలీల.. ఇలాంటి డ్యాన్స్ ఎప్పుడూ చూసుండరు!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఆ కుటుంబం నుంచి టాలీవుడ్‌లోకి దాదాపు పది మంది హీరోలు కూడా పరిచయం అయ్యారు. వాళ్లలో చాలా మంది స్టార్లుగా సత్తా చాటుతోన్నారు. ఇక, అదే ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత పలు సినిమాలతో వచ్చినా పెద్దగా విజయాలను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో 'ఆదికేశవ' అనే సినిమాను చేస్తున్నాడు.
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడు తెరకెక్కించిన సినిమానే 'ఆదికేశవ'. డివోషనల్ టచ్‌తో రూపొందుతోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన అన్ని కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను వదిలారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆదికేశవ' మూవీని నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్‌ను ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రం నుంచి 'లీలమ్మో' అంటూ సాగే పాటను విడుదల చేశారు.
మంచి మాస్ బీట్‌తో వచ్చిన ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేయగా.. అజీజ్, ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. దీన్ని కాసర్ల శ్యామ్ రాశారు. ఈ పాట అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మూమెంట్లు అదిరిపోయాయి. శ్రీలీల, వైష్ణవ్ తేజ్ పోటీపోటీగా నర్తించారు. ఇది అతడి కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్ అనిపించుకునేలా ఉంది. దీంతో ఈ పాట యూట్యూబ్‌లో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
'ఆదికేశవ' ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











