ఉప్పెన అప్‌డేట్.. ధక్ ధక్ ధక్ అంటూ రెండో అల
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కాబోతోన్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన అంటూ రాబోతోన్న ఈ హీరో.. ఇప్పటికే భారీ అంచనాలు పెంచేశాడు. పోస్టర్స్, ఫస్ట్ లుక్స్‌తోనే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించాడు. ఉప్పెన మొదటి అలను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్ర యూనిట్ రెండో అలను కూడా సిద్దం చేసింది.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ పెంచేశారు. ఇప్పటికే నీ కన్ను నీలి సముద్రం పాట అందరి మనసులోని దోచేసింది. ఈ పాటకు ఫిదా కాని వారు, క్రితి శెట్టి అందానికి పడిపోని వారెవరూ లేరు. ఈ పాటలో వైష్ణవ్ తేజ్ లుక్స్‌తోనే అదరగొట్టేశాడు.

తాజాగా రెండో అల కూడా రాబోతోందని ప్రకటించారు. ధక్ ధక్ ధక్ అంటూ సాగే ఈ పాట.. మార్చి 9న సాయంత్రం 4.05 గంటలకు వీడియో పాట రిలీజ్ కానుందని తెలిపారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ రోల్‌ను పోషించాడు. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











