లవర్స్ డే రోజు లవ్ మోడ్‌లోకి నాని.. జెర్సీ నుంచి ఫస్ట్ సింగిల్!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని క్రికెటర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఎమోషనల్ గా రూపొందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. దీనితో జెర్సీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
క్రికెటర్‌గా నాని ఎలా నటించాడనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే జెర్సీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న జెర్సీ చిత్ర యూనిట్ 'అదేంటోగాని ఉన్నపాటుగా' అనే లవ్ బీట్ ని విడుదల చేయబోతోంది.

చిత్ర యూనిట్ తాజాగా నాని, శ్రద్ధ శ్రీనాథ్ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసింది. నాని లవ్ మోడ్ లో కనిపిస్తున్నాడు. క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలగనే అర్జున్ అనే యువకుడి పాత్రలో నాని నటిస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











