ఏం సాంగురా బై.. అదిరిపోయింది.. హిట్టు పక్కా అంటున్న మెగా ఫ్యాన్స్..
మెగా హీరోల్లో అందరిలో కెల్లా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. వరుణ్ ఎంట్రీనే.. మెగా ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా భిన్న చిత్రాలు తీస్కుంటూ వెళ్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టాడు..
సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ చిత్రాలను తట్టుకుని ఎఫ్2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ కాబట్టి వరుణ్ కు అంత ఫేమ్ లభించలేదు. కానీ వరుణ్ అటెంప్ట్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక మళ్ళీ ఇదే ఏడాది సోలో హిట్టు కొట్టేందుకు రెడీ అయ్యాడు.

తమిళ హిట్ మూవీ రీమేక్ లో విలన్ గా..
తమిళంలో హిట్ అయిన జిగర్తాండ ను తెలుగులో వాల్మీకి గా.. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. అక్కడ బాబీ సింహా చేసిన క్యారెక్టర్ ను వరుణ్ ఇక్కడ చేయగా.. సిద్ధార్థ్ పాత్రను తమిళ హీరో అథర్వా పోషిస్తున్నాడు. ఇక స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు పూజా హెగ్డే ఓ కీ రోల్ ప్లే చేస్తోంది.

వైరల్ అయిన వరుణ్ లుక్..
వాల్మీకిని ఎప్పుడు అనౌన్స్ చేశారో అప్పటినుంచి వరుణ్ లుక్ పై అందరికీ అనుమానాలు ఉండేవి. అయితే గడ్డం వేసుకుని భారీ ఖాయంతో ఉన్న వరుణ్.. ఆ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించాడు. ఇక టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా దుమ్ము లేపటం గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ను భారీ స్థాయిలో చిత్రీకరించారు. అది ఏ సినిమాకు ప్లస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అలనాటి గోదావరి అందాలను చుపించిన ఎల్లువచ్చే గోదారమ్మ..
ఎల్లువచ్చే గోదారమ్మ .. అనే సాంగ్ తెలియని తెలుగు వారుండరు. ఆ పాటను తెరకెక్కించిన విధానం, బిందెలతో సెట్ వేయడం, శ్రీదేవి-శోభన్ బాబు జంట ఇలా ఈ పాట చరిత్రను సృష్టించిoది. ఇప్పుడు ఈ పాట ను.. వరుణ్-పూజా హెగ్డే పై చిత్రీకరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
వైరల్ అవుతున్న ప్రోమో...
మిక్కీ జె మేయర్ ఈ పాటను అద్భుతంగా రీమేక్ చేయగా.. అంతే అందంగా సెట్ వేసి చిత్రీకరించారు. ఇక ఈ ప్రోమోను చూసిన అభిమానులు తెగ సంబర పడుతున్నారు. బొమ్మ సూపర్ హిట్టు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











