Kodthe Full Video: గని సినిమా నుంచి స్పెషల్ ట్రీట్.. రిలీజ్‌కు ముందే ఫుల్ వీడియో
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రతి ప్రాజెక్టుకూ వైవిధ్యాన్ని చూపించడంతో అతడు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ విజయాలను అందుకుని జోష్‌లో ఉన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటించాడు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రమే 'గని'. బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ దీనికి బ్రేకులు పడడంతో చిత్రీకరణ మాత్రం అనుకున్న సమయానికి కంప్లీట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌ను ఇటీవలే కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు, ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టి.. వాటిని కూడా శరవేగంగానే పూర్తి చేసేశారు. ఇలా ఇప్పుడు సినిమాను విడుదలకు సిద్దం చేశారు.

కమర్షియల్ పంథాలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మూవీ యూనిట్ ఎప్పుడో భావించింది. ఇందులో భాగంగానే గత ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్ 24కు పోస్ట్‌పోన్ చేశారు. కానీ, అప్పటికి కూడా పనులన్నీ పూర్తి కాకపోవడంతో ఈ చిత్రాన్ని ఏకంగా మార్చి 18కి వాయిదా వేశారు. కానీ, ఆ తర్వాత ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని అన్నారు. కానీ, అది కూడా కుదరకపోవడంతో ఏప్రిల్ 8వ తేదీని విడుదల చేస్తున్నారు.
'గని' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రచార చిత్రాలను విడుదల చేయాలని భావించింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి 'కోడ్తే' అంటూ సాగే స్పెషల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తనదైన స్టెప్పులతో అలరించింది. మోటివేషన్‌గా సాగే ఈ పాటను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేయగా.. హారికా నారాయణ్ ఆలపించింది. అలాగే, ఆ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ సాంగ్‌కు శ్రోతల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా వైరల్ అయిపోయింది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గని' మూవీలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటించాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించింది. నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర, జగపతి బాబు, నదియా కూడా కీలక పాత్రలను చేశారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











