Ghani Anthem Lyrical: ఇరక్కొట్టేసిన థమన్.. మెగా ప్రిన్స్ పంచులకు థియేటర్లు మోతే
మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయం అయినా.. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ సహా ఎన్నో విభాగాల్లో సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుందా' సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు.. ఆ వెంటనే జాతీయ అవార్డును అందుకున్న 'కంచె' మూవీతో నేషనల్ లెవెల్‌లో ఫేమస్ అయ్యాడు. ఇలా ఆరంభంలోనే తన మార్కును చూపించి స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత కూడా పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుణ్ తేజ్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
వరుణ్ తేజ్ ఇటీవలి కాలంలో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరింత జోష్‌తో కనిపిస్తున్నాడు. అలా ఎన్నో ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతడు ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇందులో చివరి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా చేసింది. అయితే, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల 'గని' మూవీ యూనిట్ ఫస్ట్ పంచ్ పేరిట ఓ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
షూటింగ్ దాదాపుగా పూర్తవడంతో పాటు డబ్బింగ్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభం కావడంతో 'గని' మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ఏంథమ్ సాంగ్‌ను విడుదల చేశారు. థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. దీన్ని ఆదిత్య అయ్యంగార్, శ్రీకృష్ణ, సాయి చరణ్‌తో పాటు పృథ్వీ చంద్ర ఆలపించారు. ఇందులో థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌గా ఉంది. అలాగే, వరుణ్ తేజ్ బాక్సింగ్ ట్రైనింగ్ పంచుల విజువల్స్ చూపించారు. ఇందులో సునీల్ శెట్టి పాత్రను కూడా చూపించారు. మొత్తంగా ఈ పాట థియేటర్లలో మోత మోగించేలా ఉంది.
'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











