Veera Simha Reddy: జై బాలయ్య సాంగ్.. ఆ పాటకు కాపీ అంటూ మళ్ళీ థమన్ పై ట్రోలింగ్.. దారుణంగా..

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరపైకి రాబోతున్న బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీ వీర సింహారెడ్డి పై అంచనాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయి ఎక్కువగానే ఉంది. ఇక ఈరోజు థమన్ స్వరపరిచిన మొదటి సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటపై కూడా థమన్ మళ్ళీ ఎప్పటిలాగానే కాఫీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియాలో అయితే దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే థమన్ హిట్ అయిన ఒక పాట నుంచి ఈ ట్యూన్ కాపీ కొట్టాడు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పోటీలో గ్రాండ్ రిలీజ్

సంక్రాంతి పోటీలో గ్రాండ్ రిలీజ్


క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్, అలాగే అఖండ తర్వాత బాలకృష్ణ ఇద్దరు కలిసి చేస్తున్న వీరసింహారెడ్డిపీకి మార్కెట్లో అయితే మంచి డిమాండ్ ఏర్పరచుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలోనే సంక్రాంతికి విడుదల చేయబోతోంది. పోటీగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా భారీ స్థాయిలో క్రేజ్ అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

పవర్ఫుల్ కాంబినేషన్

పవర్ఫుల్ కాంబినేషన్

ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా అఖండ సినిమా తర్వాత కూడా మరోసారి బాలయ్య సినిమాకు థమన్ సంగీతం అందిస్తూ ఉండటం వలన అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంతేకాకుండా గోపిచంద్ మలినేని కాంబినేషన్లో కూడా ఇంతకుముందు థమన్ వరుసగా సినిమాలు చేశాడు. కాబట్టి ఈ కాంబినేషన్ కు కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది.

జై బాలయ్య సాంగ్

అయితే గత రెండు రోజుల నుంచి జై బాలయ్య సాంగ్ విడుదల కాబోతోంది అంటూ ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా హడావిడి ఎక్కువగానే కనిపించింది. మొత్తానికి ఈరోజు ఉదయం జై బాలయ్య సాంగ్ ను విడుదల చేశారు. ఇక అనుకున్నట్లుగానే ఓ వర్గం వారి నుంచి ఈ పాటకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. అంతేకాకుండా పాటలో అప్పుడప్పుడు థమన్ ఇచ్చిన ఎంట్రీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

మళ్ళీ కాపీ అంటూ..

అయితే జై బాలయ్య పాట మాస్ ప్రేక్షకులకు బాగానే నచ్చినప్పటికీ కూడా ఓ వర్గం వారు మాత్రం ఎక్కువగా సోషల్ మీడియా లో ట్రోలింగ్ అయితే మొదలుపెట్టేసారు. సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాలకి.. ఒసేయ్ రాములమ్మ ట్యూన్ కు చాలా దగ్గరగా ఉంది అని థమన్ అయితే దాదాపు అదే తరహాలో ట్యూన్ దించేశాడు అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. థమన్ అయితే కొంచెం కూడా తగ్గడం లేదు.

మరో సాంగ్ కూడా త్వరలోనే..

మరో సాంగ్ కూడా త్వరలోనే..

గతంలో ట్రోలర్స్ పై థమన్ కొంత సీరియస్ అయిన విషయం తెలిసిందే. కానీ ప్రతిసారి థమన్ అదే తరహాలో కాపీ చేసినట్లు ట్రోలింగ్ ను ఎదుర్కొంటూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక వచ్చే నెలలో సినిమాకు సంబంధించిన మరొక పాటను కూడా విడుదల చేయనున్నారు. ఇక జై బాలయ్య పాటతో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు అయితే బాగానే కిక్ ఇచ్చిన థమన్ ట్రోలర్స్ నుంచి మాత్రం బయటపడలేక పోయాడు. మరి రాబోయే సాంగ్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X