Maa Bava Manobhavalu: వీరసింహారెడ్డి స్పెషల్ సాంగ్.. బాలయ్య నెవ్వర్ బిఫోర్ స్టెప్పులు

ఆ మధ్య కాలంలో కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడినా.. గత ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ ఊపులోనే ఆయన కొత్త సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' అనే సినిమాలో నటిస్తోన్నారు. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హై లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'వీరసింహారెడ్డి' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ఇప్పటికే మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఈ మూవీ నుంచి రెండు పాటలను కూడా విడుదల చేసింది. ఈ క్రమంలోనే దీని నుంచి స్పెషల్ నెంబర్ 'మా బావ మనోభావాలు' అనే సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్యా థియేటర్‌లో స్పెషల్ ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ ఓ రేంజ్‌లో సందడి వాతావరణం నెలకొంది.

Veera Simha Reddy Maa Bava Manobhavalu song Released

ఇక, 'వీరసింహారెడ్డి' మూవీ నుంచి తాజాగా విడుదలైన 'మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయి' సాంగ్‌ను యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ కంపోజ్ చేశాడు. దీనికి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. సాహితి చాగంటి, యామిని, రేణూ కుమార్‌లు ఆలపించారు. ఇక, ఇందులో హనీ రోజ్, చంద్రికా రవి తమదైన అందచందాలతో అలరించారు. మరీ ముఖ్యంగా ఈ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేసిన స్టెప్పులను నందమూరి బాలకృష్ణ ఇరగదీసేశారు. సోడా బండి మీద వేసిన మూమెంట్ అయితే హైలైట్ అని చెప్పాలి. దీంతో ఈ పాటకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇది జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X