Don't Miss!
- News
తారకరత్న చికిత్సలో కీలక మలుపు
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Suguna Sundari Song Review బాలకృష్ణ, శృతిహాసన్ మాస్, క్లాస్ కెమిస్ట్రీ అదుర్స్.. సుగుణ సుందరి అంటూ రెచ్చిపోయి.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్, పవర్ ప్యాక్ట్ చిత్రం వీరసింహారెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ తర్వాత ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్‌లో భాగంగా డిసెంబర్ 15 తేదీన వీరసింహారెడ్డి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సుగుణా సుందరి అంటూ సాగిన పాట ఎలా ఉందంటే..

సుగుణ సుందరి అంటూ బాలయ్య
బాలకృష్ణ, శృతిహాసన్‌పై చిత్రీకరించిన సుగుణ సుందరి పాటకు శేఖర్ మాస్టర్ నృత్యాలను సమకూర్చాడు. రామజోగయ్యశాస్త్రీ సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల, స్నిగ్ద శర్మ పాడిన పాటకు సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించారు. మాస్, మసాలాతో కూడిన ఈ పాటను రామ్ మిర్యాల, స్నిగ్ద మంచి జోష్‌తో పాడగా, బాలయ్య, శృతి హాసన్ పాటలో చెలరేగిపోయారు.
ఊరమాస్ స్టెప్పులతో బాలయ్య
బాలకృష్ణ క్లాసిక్ అవుట్‌ఫిట్‌తో కనిపించగా.. శృతి నలుపు, ఎరుపు, తదితర రంగు దుస్తుల్లో గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. బాలయ్య, శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ మాస్, క్లాస్ అదుర్స్ అనే విధంగా కనిపించింది. విదేశాల్లో మంచుకొండల్లో చిత్రీకరించిన ఈ పాటపై ఊరమాస్ స్టెప్పులతో బాలయ్య అదరగొట్టేశాడు.

పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో వీరసింహారెడ్డి
ఫ్యాక్షన్, యాక్షన్ మేలవించి రూపొందుతున్న వీరసింహారెడ్డి చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు అందించారు. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇప్పటికే టీజర్‌లో పేలిపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జనవరి 12వ తేదీన రిలీజ్
వీరసింహారెడ్డి చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలీ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, రామ్ లక్షన్ స్టంట్ కోరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరంటే?
నటీనటులు:
నందమూరి
బాలకృష్ణ,
శృతిహాసన్,
దునియా
విజయ్,
వరలక్ష్మీ
శరత్‌కుమార్,
చంద్రికా
రవి
తదితరులు
కథ,
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం:
గోపిచంద్
మలినేని
నిర్మాతలు:
నవీన్
యెర్నేనీ,
వై
రవిశంకర్
బ్యానర్:
మైత్రీ
మూవీ
మేకర్స్
సినిమాటోగ్రఫి:
రిషి
పంజాబి
ఎడిటర్:
నవీన్
నూలి
సీఈవో:
చిరంజీవి
(చెర్రీ)
పీఆర్వో:
వంశీ
శేఖర్
రిలీజ్
డేట్:
2022-01-2023