Don't Miss!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- News
ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy: మా బావ మనోభావాలు.. అంటూ ఊరమాస్ సాంగ్ రెడీ.. ప్రోమో అదిరింది!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ వీర సింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన సాంగ్స్ తో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
సినిమాకు సంబంధించిన సాంగ్స్ తోనే అంచనాలను అమాంతంగా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి పాట జై బాలయ్య మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా తర్వాత సుగుణా సుందరి కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి వస్తున్న మూడవ పాట మరింత విభిన్నంగా ఆకట్టుకోబొతున్నట్లు అర్థమవుతుంది.

డిసెంబర్ 24వ తేదీన మధ్యాహ్నం 3:19 నిమిషాలకు మా బావ మనోభావాలు అనే పాట విడుదల చేయబోతున్నారు. ఇక ఈ పాటకు సంబంధించిన ప్రోమో అయితే అదిరిపోయింది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బాలయ్య బాబు తో పాటు చంద్రిక రవి డ్యాన్స్ స్టెప్పులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా ఈ సాంగ్ అయితే థియేటర్లో దద్దరిల్లిపోతుంది అని అర్థమవుతోంది.
మాస్ ఆడియన్స్ కు ఎలాంటి సినిమాలు అందించాలో దర్శకుడు గోపీచంద్ కు బాగా తెలుసు. ఇక అతని సినిమాకు తగ్గట్టుగా పాటలు ఎలా ఇవ్వాలో కూడా థమన్ కు సైతం బాగా తెలుసు. ఇక వీరి కాంబినేషన్లో బాలయ్య బాబు ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించడం ఖాయమని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ మేయిన్ హీరోయిన్ గా నటించగా దునియా విజయ్ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.