Jailer: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు వెంకటేష్ సర్‌ప్రైజ్.. ఏం పవర్‌ఫుల్‌గా ఉంది గురూ!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు, అన్నింటికీ మించి స్టైలిష్ గెటప్‌లతో సౌతిండియాలోనే బడా సూపర్ స్టార్‌గా వెలుగొందుతోన్నారు రజినీకాంత్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఆయన.. ఏజ్‌తో సంబంధం లేకుండా ముందుకు సాగిపోతోన్నారు. ఇలా గత ఏడాది 'అన్నత్తే' అనే సినిమాతో సందడి చేశారు. అయితే, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో రజినీకాంత్.. నెల్సన్ దర్శకత్వంలో 'జైలర్' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.
పవర్‌ఫుల్ స్టోరీతో రాబోతున్న 'జైలర్' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఇక, ఈ సినిమా రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు. ఇలా ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే తాజాగా 'జైలర్' మూవీలోని మరో పాటను టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా రిలీజ్ చేశారు.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'జైలర్' మూవీని ఆగస్టు 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన 'హుకుం' అంటూ సాగే పాటను విడుదల చేశారు. అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను దినకర్ కల్వాల ఆలపించారు. దీనికి భాస్కరభట్ల లిరిక్స్‌ను ఇచ్చారు. ఇక, ఈ సాంగ్ ఆద్యంతం హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసే విధంగా చూపించారు. ముఖ్యంగా ఇందులోని లిరిక్స్ అన్నీ అదిరిపోయేలా వచ్చాయి. దీంతో ఈ పాటకు రజినీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు అందరి నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది.
ఇక.. రజినీకాంత్ - నెల్సన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'జైలర్' మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











