వెంకీ మామ టైటిల్ సాంగ్ అదిరింది.. మామ అల్లుళ్ళ మధ్య బాండింగ్ అంతా చెప్పేశారు
నేటి హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలంటే బెటర్ ఆప్షన్ వెంకటేష్ అని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. మల్టీస్టారర్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో అదే బాటలో వెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా సరికొత్త మల్టీస్టారర్ సినిమాకు ముహూర్తం పెట్టేశారు డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర).
పైగా ఈ చిత్రానికి 'వెంకీ మామ' అనే ఆసక్తికర టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్‌డేట్స్ ఆసక్తి రేకెత్తించగా, తాజాగా 'వెంకీ మామ' టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆత్రుత నింపారు. 4 నిమిషాల 18 సెకనుల నిడివితో కూడిన ఈ పాటలో సింగర్స్ స్వరం, అచ్చమైన పల్లెటూరి వాతావరణంలోని సీన్స్ హైలైట్ అవుతున్నాయి. మామ అల్లుళ్ల మధ్య బాండింగ్, ఆ ఇద్దరి క్షేమం కోరుతున్నట్లుగా ఈ పాట ద్వారా తెలిపారు మేకర్స్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా శ్రీ కృష్ణ ఆలపించారు.
వెంకీమామ చిత్రంలో ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసే కామెడీ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్య మామ అల్లుళ్లుగానే నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కడుతున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











