HIT: నాని వదిలిన 'వెంటాడే గాయం'
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన HIT మూవీ విడుదలకు సిద్ధమైంది. నాని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను ఫిబ్రవరి 28న పేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా ఆకట్టుకుంది.
ఇక ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి HIT విశేషాలు చెప్పిన యూనిట్ సభ్యులు తాజాగా చిత్రంలోని ''వెంటాడే గాయం'' లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. సినిమాపై ఆసక్తి రేకెత్తించే క్లిప్పింగ్స్ జోడించి 3 నిమిషాల 32 సెకనుల నిడివి గల ఈ పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ పై మోహన్ భోగరాజు ఈ పాటను ఆలపించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చారు.

నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై HIT మూవీ రూపొందింది. ఈ సినిమాకి శైలేశ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించాడు. చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. నానితో పాటు ఈ చిత్రానికి మరో నిర్మాతగా ప్రశాంతి వ్యవహరించింది. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలనే పట్టుదలతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకొని రూపొందించారు నాని.
మిస్సింగ్ కేస్ నేపథ్యంలో థ్రిల్లింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











