Liger Akidi Pakidi Video Song: మాస్ స్టెప్పులతో విజిల్స్ వేయించిన విజయ్ దేవరకొండ.. కిర్రాక్ సాంగ్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రాబోతున్న లైగర్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఇద్దరు మొదటిసారి పాన్ ఇండియా ప్రపంచంలో హై వోల్టేజ్ యాక్షన్ సినిమాతో అడుగుపెట్టబోతున్నారు. ఇక లైగర్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నుంచి కూడా అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు పెంచాయి. తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని కూడా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు మొదటి పాటతో కూడా చిత్ర యూనిట్ అంచనాల స్థాయిని మరింత పెంచేసింది.
అకిడి పకిడి అనే సాంగ్ విడుదల చేయబోతున్నట్లు గత వారం రోజులకు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసి ఆడియన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చారు. విజయ్ దేవరకొండ మాస్ ప్రేక్షకులకు వచ్చే విధంగా అదిరిపోయే స్టెప్పులతో విజిల్స్ వేయించాడనే చెప్పాలి. విజయ్ దేవరకొండ ఈసారి డాన్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు ఈ పాటతో అర్థమైంది.
లీజో జార్జ్ - డీజే చేతస్ మ్యూజిక్ కంపోజింగ్ లో వచ్చిన ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి రమ్య బెహ్రా పాడారు. తెలుగు తమిళ్ మలయాళం అలాగే హిందీ భాషల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇక అన్ని భాషల వరకి నచ్చే విధంగానే ఈ పాటను విడుదల చేయడం జరిగింది. ఇక విడుదలైన కొన్ని నిమిషాలోనే ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది.

ఇదివరకే ఫస్ట్ లుక్ టీజర్ తో సెన్సేషన్ అయ్యేలా బజ్ క్రియేట్ చేసిన లైగర్ టీమ్ ఇప్పుడు మరోసారి మొదటి పాటతోనే అన్ని వర్గాల ఆడియెన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నారు. చూస్తుంటే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక లైగర్ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











