గాలి సంపత్ సెకండ్ సింగిల్.. అనిల్ రావిపూడి స్టైల్లో ప్రమోషన్స్!
అనిల్ రావిపూడి తెరపై పండించే కామెడీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తెర వెనుక అనిల్ రావిపూడి అంతకు మించి అనేలా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు. మరీ ముఖ్యంగా మిమిక్రీ చేయడంలో అనిల్ రావిపూడి స్పెషల్. ఎవరినైనా సరే ఇట్టే అనుకరించేయగలడు. తాజాగా తన గాలి సంపత్ మూవీ సినిమా కోసం వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. కథ, మాటలు అందించి.. దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ సమర్పిస్తోన్న గాలి సంపత్ కోసం అనిల్ రావిపూడి బాగానే కష్టపడుతున్నాడు.
తనకున్న పరిచయాలతో సినిమాను వీలైనంతగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే వదిలిన ట్రైలర్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. రాజమౌళి చేతుల మీదుగా గాలి సంపత్ ట్రైలర్ రిలీజ్ చేయించి అందరి దృష్టి పడేలా చేసుకున్నారు. ఇక మొదటి పాటను నాని చేతుల మీదుగా విడుదల చేయించారు. అది బాగానే క్లిక్ అయింది. ఇక రెండో పాట కోసం కొత్త ప్లాన్‌ను వేశారు. ఈ మేరకు అనిల్ రావిపూడి తన క్రియేటివిటీకి పదును పెట్టేశాడు.

మొదటి పాటను నాని రిలీజ్ చేశాడు.. నాని ఫోటోను పెట్టి పోస్టర్‌ను రిలీజ్ చేశాం.. ఇప్పుడు రెండో పాటను విజయ్ దేవరకొండ రిలీజ్ చేస్తున్నాడు.. దీని కోసం ఏదైనా పోస్టర్‌ను రెడీ చేద్దామా... కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా? అని అనిల్ రావిపూడి అనడం.. ఈసారి వాయిస్ ఓవర్‌తో కానిచ్చేద్దామని అనడం, ఆ వాయిస్ ఓవర్ విని.. చండాలంగా ఉందన్నట్టుగా ఓ సెటైర్ వేసి.. మొదటి పాటకు ఎలా చేశామో.. దీనికి కూడా అలానే పోస్టర్ వేసేయండని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అలా మొత్తానికి రెండో పాటను విజయ్ దేవరకొండ రిలీజ్ చేయబోతోన్నాడని ప్రకటించేశారు. మార్చి 11న గాలి సంపత్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











