Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
గిరా గిరా అంటూ గిరాకీ పెంచేసిన విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా డియర్ కామ్రేడ్. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ క్రేజీ జోడీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, యశ్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దినకరన్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న డియర్ కామ్రేడ్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. లేట్ అవుతున్నా కొద్ది ఈ సినిమాపై అంచానాలు రెట్టింపవుతూ వచ్చాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్డేట్స్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కాగా తాజాగా చిత్రంలోని గిరా గిరా సాంగ్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
"గిరా గిరా'' అంటూ మంచి మెలోడీ ట్యూన్తో ఈ పాట సాగిపోతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, రెహ్మాన్ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్, యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరీర్లో మొదటిసారి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. జులై 26 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.