twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గిరా గిరా అంటూ గిరాకీ పెంచేసిన విజయ్ దేవరకొండ

    |

    యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా డియర్ కామ్రేడ్. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ క్రేజీ జోడీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం, య‌శ్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దినకరన్ సంగీతం అందిస్తున్నారు.

    Vijay Deverakondas latest movie Dear Comrade Song

    ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న డియర్ కామ్రేడ్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. లేట్ అవుతున్నా కొద్ది ఈ సినిమాపై అంచానాలు రెట్టింపవుతూ వచ్చాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కాగా తాజాగా చిత్రంలోని గిరా గిరా సాంగ్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ వేగంగా వ్యూస్ రాబడుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

    "గిరా గిరా'' అంటూ మంచి మెలోడీ ట్యూన్‌తో ఈ పాట సాగిపోతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, రెహ్మాన్ సాహిత్యం, గౌతమ్ భరద్వాజ్, యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మొదటిసారి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. జులై 26 వ తేదీన భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డియర్ కామ్రేడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Young hero Vijay Deverakonda's latest movie Dear Comrade. From this movie third song released and creating sensetion in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X