Family Star పెళ్లి కూతురు కోసం విజయ్ దేవరకొండ పంచ కల్యాణి.. ట్రెండింగ్‌గా ఫ్యామిలీ స్టార్ సాంగ్!
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. పేట్ల పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్ నటించిన ఈ సినిమాకు వాసువర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని కళ్యాణి వచ్చా వచ్చా అనే పాటను రిలీజ్ చేశారు. ఆ పాట వివరాల్లోకి వెళితే..

ప్యామిలీ స్టార్ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంగా సాగే పాటను హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, మృణాల్ థాకూర్‌పై చిత్రీకరించారు. మ్యారేజ్ సెలబ్రేషన్ సాంగ్ కోసం పాపులర్ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ పాటను మంగ్లీ, కార్తీక్ ఆలపించారు.
ఫ్యామిలీ స్టార్ పాట సాహిత్యం వివరాల్లోకి వెళితే..
కల్యాణి వచ్చా వచ్చా
పంచ కల్యాణి తెచ్చా తెచ్చా
డుముకు డమా డమారీ
చమకు చమకు చమారీ
సయ్యారీ సరాసరి
మొదలు పెట్టేయ్ సవారీ
డుముకు డుమా డమారీ
జమకు జమా జమారీ
ముస్తాబై ఉన్నామరి
అదరగొట్టే కచేరి
చిటెకెలు వేస్తుంది
కునుకు చెడిన కుమారి
చిటికెన వేలు ఇస్తే చివరి వరకు షికారీ
ఎన్నో పొదలెనుకా
ఎంతో పదిలంగా
ఒదిగిన పుప్పడిని
ఇప్పుడు అప్పగించా
కల్యాణి వచ్చా వచ్చా
పంచ కల్యాణి తెచ్చా తెచ్చా
డుముకు డమా డమారీ
చమకు చమకు చమారీ
సింగారి చెయ్యిందించా
నీకు అంబారి సిద్దం చేయించా అనే పాటను అనంత్ శ్రీరామ్ రొమాంటిక్‌గా రాయడంతో యూత్‌కు భారీగా కనెక్ట్ అయ్యేలా చేశారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా సాంకేతిక వర్గం వివరాల్లోకి వెళితే..
సినిమాటోగ్రఫి: కేయూ మోహనన్
మ్యూజిక్: గోపిసుందర్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఎఢిటర్: మార్తాండ్ కే వెంకటేష్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: వాసు వర్మ
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: పరుశురామ్ పేట్ల


Click it and Unblock the Notifications











