విజయ్ పొలకి స్టెప్పులకు ఇండస్ట్రీ ఫిదా.. ఊ అంటావా? ఊఊ అంటావా పాటతో యువ కొరియోగ్రాఫర్ క్రేజీగా!

ఒకప్పుడు బాలీవుడ్, లేదా తమిళ కోరియోగ్రాఫర్లకు టాలీవుడ్‌లో భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైనట్టు కనిపిస్తున్నది. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్, యువ కోరియోగ్రాఫర్లు ప్యాన్ ఇండియా స్థాయిలో తమను ప్రతిభను చాటుకొంటున్నారు. తన టాలెంట్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొంటున్న కోరియోగ్రాఫర్లలో విజయ్ పోలకి ఒకరు. పుష్ప సినిమా తర్వాత ఈ యువ కోరియోగ్రాఫర్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి నోళ్లలలో నానుతున్నది. టాప్ హీరోల ప్రశంసలు అందుకొంటున్న విజయ్ పొలకి గురించిన వివరాల్లోకి వెళితే..

ఇటీవల కాలంలో విజయ్ నృత్యాలు సమకూర్చిన పాటలు ఎన్నో ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించాయి. విజేత, కొబ్బరిమట్ట, తిప్పరామీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు.

Vijay Polaki gets huge response after oo antava oo oo antava song in Pushpa

ఇక తాజాగా విజయ్ పోలకి కొరియోగ్రాఫ్ చేసిన పుష్ప చిత్రంలోని పాటలు అందర్నీ విశేషంగా ఆకట్టుకొన్నాయి. సమంత రుత్ ప్రభు కనిపించిన స్పెషల్ సాంగ్ కూడా విజయ్ పోలకి కోరియోగ్రాఫ్ చేయడం విశేషంగా మారింది. ఊ అంటావా.. ఊఊ అంటావా పాటకు డ్యాన్స్ మాస్టర్‌గా వ్యవహరించిన విజయ్ డిజైన్ చేసిన స్టెప్పులకు మంచి క్రేజ్ లభిస్తున్నది. ఈ పాటకు డిజైన్ చేసిన స్టెప్పులకు సమంత కూడా ఫిదా అయ్యారు. ఇక పుష్ప సినిమాలోని పాటకు కొరియోగ్రాఫ్ అందించిన విజయ్‌ను అల్లు అర్జున్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రశంసలు కురిపించారు.

Vijay Polaki gets huge response after oo antava oo oo antava song in Pushpa

పుష్ప చిత్రం తర్వాత ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా నటించిన హీరో చిత్రానికీ నృత్యాలు అందించారు. హీరో చిత్రంలో డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్‌కు విజయ్ కంపోజ్ చేసిన అదిరే స్టెప్పులకు మంచి పేరు వస్తున్నది. ఇంకా నరకాసురతోపాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లకు విజయ్ పోలకి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ యువ కొరియోగ్రాఫర్ స్పీడ్ చూస్తుంటే స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నాయనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X