వైరల్ వీడియో షేర్ చేసిన ఏఆర్ రెహమాన్, ఆమె టాలెంట్ చూసి ఆశ్చర్యం!
Recommended Video

కొన్ని నెలల క్రితం కేరళ రబ్బరు తోటల్లో పని చేస్తున్న ఓ కూలీ తన సింగింగ్ టాలెంటుతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అతడి టాలెంటును గుర్తించి కమల్ హాసన్, శంకర్ మహదేవన్ లాంటి వారు సైతం అభినందించారు.
తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మహిళ వీడియో నేషనల్ వైడ్ వైరల్ అయింది. 1994లో వచ్చిన 'ప్రేమికుడు' సినిమాలోని ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన 'ఓ చెలియా' పాటను ఆమె పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చివరకు రెహమాన్ వరకు చేరింది. దాన్న ఆయన స్వయంగా తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేస్తూ అద్భుతమైన వాయిస్ అంటూ ప్రశంసలు గుప్పించారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 1 మిలియన్‌పైగా వ్యవూస్, వేలాది లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అయితే ఈవిడ ఎవరు? అనే విషయం తెలియక పోవడంతో రెహమాన్ ఆమె పేరు తన పోస్టులో ప్రస్తావించలేక పోయారు.

ఓ తెలుగు న్యూస్ ఛానల్ కథనం ప్రకారం... సంగీత దర్శకుడు కోటి ఆమెను రీచ్ అయినట్లు తెలుస్తోంది. ఆమె పేరు బేబీ అనే ప్రచారం జరుగుతోంది. త్వరలో బేబీకి తెలుగు సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కుతుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











