‘వినయ విధేయ రామ’ అప్డేట్: ‘తందానే.. తందానే’ అంటూ రామ్ చరణ్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం విన‌య విధేయ రామ‌. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈచిత్రం 2019 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు.

Vinaya Vidheya Rama First Single Thandaane Thandaane release date

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగల్ 'తందానే తందానే' పాటను డిసెంబర్ 3, సాయంత్ర 4 గంటలకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

పలు విజయవంతమైన చిత్రాలతో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్.... మాస్, యాక్షన్ మూవీల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ వినయ విధేయ రామపై అంచనాలు ఆకాశాన్నంటాయి. చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‍‌గా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X