దూసుకుపోతోన్న విరాటపర్వం పాట.. సాయి పల్లవి హైలెట్!
రానా-సాయి పల్లవి కాంబోలో రాబోతోన్న విరాట పర్వం సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. నీదీ నాదీ ఒకే కథ అనే చిత్రంతో అందరినీ కట్టిపడేసినా వేణూ ఊడుగుల ఇప్పుడు విరాటపర్వంతో ఆశ్చర్యపరిచేందుకు వస్తున్నాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు మొదలుపెట్టేశారు. తాజాగా వదిలిన పాట ఓ రేంజ్‌లో క్లిక్ అయింది.
కోలు కోలు వంటి వదిలిన సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‌లో కోలు కోలు అనే పాటకు, సాయి పల్లవి లుక్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అసలే సాయి పల్లవి, ఆమె డ్యాన్స్‌లకు సోషల్ మీడియాలో లెక్కలేనంత ఫాలోయింగ్ ఉంది. రేపు పూర్తి పాట విడుదల కాబోతోండగా.. ఈ ప్రోమోనే విపరీతంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ లెక్కన పాట కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయ్యేలా ఉంది.

ఫిబ్రవరి 25న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు పాట రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నాడు. కోలు కోలు పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కాబోతోంది. నందితా దాస్, ప్రియమణి, నివేదా పేతురాజ్ వంటి వారంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో వేణూ ఊడుగుల మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











