ప్రభాస్ కోసం హిట్ సెంటిమెంట్: వర్కౌట్ అయితే రికార్డులు గల్లంతే!
సాధారణంగా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా ఒక స్టార్ సినిమా చేయాలంటే కనీసం ఒక ఏడాది అయినా సమయం తీసుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఏకకాలంలోనే బోలెడన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. ఈ ఏడాదిలో 'ఆదిపురుష్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీని ఫలితం ఎలా ఉన్నా.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ప్రభాస్ ఎన్నో సినిమాల షూటింగ్‌లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ప్రభాస్ త్వరలోనే 'సలార్' అనే సినిమాతో రాబోతున్నాడు. దీని తర్వాత 'ప్రాజెక్టు కల్కి', 'స్పిరిట్'తో పాటు మారుతితో సినిమాను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 'సీతా రామం' దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీ చేయబోతున్నాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకూ అటు ప్రభాస్ నుంచి కానీ, ఇటు డైరెక్టర్ నుంచి కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలు తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కనుందని ఇప్పటికే న్యూస్ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, 'సీతా రామం' ఫేం విశాల్ చంద్రశేఖర్‌ను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. హను హిట్ సెంటిమెంట్‌ను ఫాలో అవడం వల్లే ఆయనకు అవకాశం ఇచ్చారని తెలిసింది. ఇది కూడా వర్కౌట్ అయితే రికార్డులు గల్లంతు కావడం ఖాయం అని చెప్పొచ్చు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించబోయే సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించబోతున్నారు. దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఐదు భాషల్లో రూపొందిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











