ఎన్టీఆర్‌పై స్పెషల్ ర్యాప్.. అదిరిపోయిన విశ్వక్‌సేన్ గిఫ్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు వంక పెట్టలేము. డ్యాన్సులు చేయడంలోనైనా, డైలాగ్స్ చెప్పడంలోనైనా ఎన్టీఆర్‌కు పోటీ లేదు. నాటి తరం హీరోల నుంచి నేటి యువ హీరోల వరకూ అందరూ ఒప్పుకునే సత్యమిది. ఎన్టీఆర్ సంపూర్ణ నటుడని ఎందరో కితాబిచ్చారు. ఆ విషయాన్ని ఎన్నో మార్లు నిరూపించుకున్నాడీ యంగ్ టైగర్. నట విశ్వరూపంతో ఎంతో మంది అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నాడు. సామాన్య జనాలు ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ కావడం సహజమే అయినా సెలెబ్రిటీల్లో దాదాపు 90శాతం ఎన్టీఆర్‌ నటనకు ఫ్యాన్ అయి ఉంటారు.

ఎన్టీఆర్ వేదికలు ఎక్కినా, వెండితెరపై కనిపించినా.. ఆ మాటల ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంతటి ప్రతిభావంతుడైన ఎన్టీఆర్‌ను.. అందరూ ముక్తకంఠంగా ఏకసంతాగ్రాహి అని చెప్పుకొంటారు. షూటింగ్ సెట్‌లో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని సినీ ప్రముఖులందరూ ప్రశంసిస్తారు. అటువంటి ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ మేరకు సోషల్ మీడియాలో నందమూరి అభిమానులతో పాటు, సినీ సెలెబ్రిటీలందరూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Vishwaksen Special Rap On Jr NTR Birthday

ఈ క్రమంలో మాస్ కా దాస్ అయిన విశ్వక్‌సేన్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. మాస్ కా బాప్ అయిన ఎన్టీఆర్‌కు మాస్ కా దాస్ ఓ ర్యాప్ సాంగ్‌ను అంకితం చేశాడు. మాస్ కా బాప్కు మాస్ కా దాస్ ట్రిబ్యూట్ అంటూ రిలీజ్ చేసిన ఈ ర్యాప్ అదిరిపోయింది. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా.. ఆదిత్యా రావ్ గంగసాని రచించాడు. ఈ పాటను విడుదల చేస్తూ.. యంగ్ టైగర్‌కు బర్త్ డే విషెస్ తెలిపాడు విశ్వక్‌సేన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X