మహిళలను కించపరిచేలా బూతులు... ప్రముఖ సింగర్‌పై కేసు!

ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల అతడు రిలీజ్ చేసిన 'మఖ్నా' అనే పాటలో మహిళలను కించపరిచే విధంగా బూతు పదాలు ఉపయోగించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పంజాబ్ రాష్ట్ర చెందిన మహిళా కమీషన్ అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. లీగల్ నోటీసులు కూడా పంపినట్లు సమాచారం.

మహిళా కమీషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటి ఓ వెబ్ పత్రికతో మాట్లాడుతూ... 'ఇతర దేశాలకు చెందిన వారు కూడా 'హరే రామ హరే కృష్ణ' జపం చేస్తుంటే... హనీసింగ్ తన పాటల్లో బలాత్కారి(రేపిస్ట్) అనే పదాలతో పాటు మహిళల గౌరవం దెబ్బతీసే బూతు పదజాలం వాడుతున్నారు' అని మండి పడ్డారు. అతడు ఇలాంటి పదాలు వాడటం ఆపాలి లేదా... ఇలాంటి పదాలను అనుమతించే వేరే దేశాలకు వెళ్లిపోవాలి అని మనీషా గులాటి సూచించారు.

Vulgar lyrics on women: FIR filed against Yo Yo Honey Singh

ఓ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం... హనీ సింగ్ మీద పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. మహిళలను దారుణంగా కించ పరుస్తూ బూతు పదాలు వాడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమీషన్ డిమాండ్ చేస్తోంది.

హనీసింగ్ విడుదల చేసిన ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో కూడా అభ్యంతరకరంగా ఉంది. దీనిపై మేము చాలా సీరియస్‌గా ఉన్నాం. సింగర్‌తో పాటు కంపెనీ ఓనర్ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని పోలీసులను కోరినట్లు గులాటి తెలిసారు. ఆ పాటను బ్యాన్ చేయాలని, మహిళలను కించ పరిచే విధంగా ఉన్న ఇలాంటి పాటలు యువతను తప్పుదారి పట్టిస్తాయని అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X