వివి వినాయక్ చేతుల మీదుగా ఉండి పోరాదే పాట.. ట్రెండింగ్‌గా టీజర్
గోల్డ్‌టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉండి పోరాదే'. ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. కాగా ప్రస్తుతం ఈ చిత్రంలోని ఓ పాటను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ విడుదల చేశారు.
వివి వినాయక్ మాట్లాడుతూ - "ఈ సినిమా టైటిల్ ఉండి పోరాదే చాలా బాగుంది. అలాగే సాబు వర్గీస్ సంగీత సారధ్యంలో రూపొందిన సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. దర్శక నిర్మాతలకు అభినందనలు. సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు.

నిర్మాత డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ.. మా చిత్ర టీజర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. వివి వినాయక్ గారి చేతుల మీదుగా మా పాట విడుదల కావడం హ్యాపీగా ఉంది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాం. మా చిత్రం మంచి ప్రమాణాలతో తెరకెక్కింది. యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము" అన్నారు.
దర్శకుడు నవీన్ నాయని మాట్లాడుతూ - " వినాయక్ గారికి కృతజ్ఞతలు. మంచి కంటెంట్‌తోపాటు సందేశాత్మక చిత్రంగా ఉండి పోరాదే తెరకెక్కింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు మ్యూజిక్ బాగా కుదిరింది. సాబు వర్గీస్ అధ్బుతమైన మ్యూజిక్‌తోపాటు మహావీర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. లిరిక్స్ కూడా బాగున్నాయి. సినిమా తప్పకుండా గణ విజయం సాధిస్తుంది" అన్నారు.
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట
మాటలు: సుబ్బారాయుడు బొంపెం
ఎడిటర్: జె.పి
ఫైట్స్: రామ్ సుంకర, నబ, సుబ్బు
మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యెలెందర్ మహావీర్ని
ర్మాత : డా. కె. లింగేశ్వర్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్ నాయని


Click it and Unblock the Notifications











