వాల్మీకి అప్‌డేట్.. గద్దల కొండ గణేష్ ఎలాంటి వాడంటే.. దడ దడ దంచుడే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వాల్మీకి'. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్ గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన యూనిట్ సభ్యులు చిత్రంలోని ''వక వక'' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ''దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దించుడే.. అడ్డమొచ్చినోడ్ని సంపుడే'' అంటూ తెలంగాణ పదజాలంతో ఈ పాట ఆకట్టుకుంటోంది.

ఈ సాంగ్‌ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్.. గద్దల కొండ గణేశ్ (వాల్మీకిలో వరుణ్ తేజ్) రోల్ ఎలా ఉంటుందో ఈ పాట వివరిస్తుంది అని పేర్కొన్నారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనుండగా ఆయన సరసన పూజా హెగ్డే మరింత డిఫెరెన్ట్ రోల్‌లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేయడంతో వాల్మీకి పట్ల మెగా అభిమానుల్లో ఆత్రుత నెలకొంది.


Click it and Unblock the Notifications











