Waltair Veerayya: బాస్ పార్టీ సాంగ్ తో ఊర మాస్.. మెగాస్టార్ లుంగీ లుక్ అదుర్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత చాలా వేగంగా మరికొన్ని సినిమాలను లైన్లోకి తీసుకు వస్తున్నాడు. ఇక ముందుగా ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియన్స్ లో మంచి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు మరో సప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
బాబీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచబోతున్నారు. ఈ సినిమాలో మొదటి పాటను త్వరలోనే విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

అయితే మొదటి పాట మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ఉండాలి అని బాస్ పార్టీ అంటూ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారట. ఇక ఈ సాంగ్ ఈనెల 23వ తేదీన సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ఒక మంచి పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్ ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంటున్నాడు.
ఇంతకుముందే చాలా సార్లు మెగాస్టార్ లుంగీ లుక్కులో స్టెప్పులు వేసి అలరించాడు. అయితే ఈసారి మరింత ఊర మాస్ లుక్కులో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. వాల్తేరు వీరయ్య డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 40 నిమిషాల వరకు ఉండబోతోంది. చిరంజీవికి రవితేజ సోదరుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక మొదటి సాంగ్ తొలి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసే విధంగా దేవిశ్రీప్రసాద్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ చిరంజీవి మధ్యలో వచ్చే మరో సాంగ్ కూడా అద్భుతంగా ఉండనుందట.


Click it and Unblock the Notifications











