twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya చిరంజీవి-రవితేజ కలిసి పాడితే.. 'పూనకాలు లోడింగ్' అంటూ మెగా మాస్ ట్రీట్!

    |

    మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మెగా అభిమానులను అలరించింది. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి, వీరయ్య టైటిల్ సాంగ్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో మాస్ నంబర్ పూనకాలు లోడింగ్ పాటను విడుదల చేశారు.

    చిరుతోపాటు మాస్ మహారాజా..

    చిరుతోపాటు మాస్ మహారాజా..

    మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి టాక్ అందుకున్న ఆయన మరో చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాల్తేరు వీరయ్యగా మరోసారి మాస్ అవతారంతో మెస్మరైజ్ చేసేందుకు మెగాస్టార్ చిరు రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

    పాటలకు సూపర్ రెస్పాన్స్..

    పాటలకు సూపర్ రెస్పాన్స్..

    సుమారు 22 ఏళ్ల తర్వాత చిరంజీవి-రవితేజ కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే హోప్స్ పెట్టుకున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాసు పార్టీ స్పెషల్ నంబర్ ను, నువ్వు శ్రీదేవి-నేను చిరంజీవి అనే మెలోడీ సాంగ్ ను, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు. ఆ పాటలకు ఎంతటి హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    స్పెషల్ అట్రాక్షన్ గా..

    స్పెషల్ అట్రాక్షన్ గా..

    ఇప్పుడు తాజాగా చిరంజీవి-రవితేజ కలిసి డ్యాన్స్ చేసే మరో మాస్ అండ్ స్పెషల్ నెంబర్ పూనకాలు లోడింగ్ అంటూ నాలుగో పాటను విడుదల చేశారు. క్లాస్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రతి ఒక్కరిని స్టెప్పు వేయించేలా ఉంది. ఈ పాటకు రోల్ రైడా ఫన్నీ లిరిక్స్ అందించగా.. సింగర్ రామ్ మిరియాలతో పాటు చిరంజీవి, రవితేజ కలిసి పాడారు. ఈ పాటకు చిరు-రవితేజ గాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనుంది. ఇక ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ డ్యాన్స్ కంపోజ్ చేశారు.

    భారీ అభిమానుల మధ్య..

    భారీ అభిమానుల మధ్య..

    చిరంజీవి, రవితేజ బాడీ లాంగ్వేజ్ లకు తగినట్లుగా శేఖర్ మాస్టార్ డ్యాన్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాస్ గెటప్ ఒకప్పటి బ్లాక్ బస్టర్స్ మూవీ ముఠా మేస్త్రీ, రౌడీ అల్లుడు చిత్రాలను తలపించగా.. రవితేజ.. చాలా ట్రెండీగా కనపిస్తున్నాడు. ఈ న్యూ ఇయర్ కు మెగా మాస్ సాంగ్ ను కలిసి పాడుకుందాం.. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ రాసుకొస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ పాటను విడుదల చేశారు. ఈ మెగా మాస్ సాంగ్ ను భారీ అభిమానుల మధ్య హైదరాబాద్ లోని సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.

    English summary
    Waltair Veerayya: Chiranjeevi Ravi Teja Sings Mega Mass Number Poonakaalu Loading Song Launched At Hyderabad Sandhya 70MM Theater
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X