Oscar వేదికపై నాటు నాటు పాటకు రాంచరణ్, ఎన్టీఆర్ దూరం.. డ్యాన్స్ ఎందుకు చేయలేదంటే?
తెలుగు జానపద నేపథ్యంతో తెరకెక్కిన నాటు నాటు పాట భాష, ప్రాంతం, దేశం అనే తేడా లేకుండా ప్రజల్ని ఆకట్టుకొన్నది. హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు యువతరాన్నే కాకుండా వృద్ధులను కూడా ప్రేరణగా నిలిచింది. కేవలం ప్రేక్షకుల మన్నల్నే కాకుండా ప్రపంచస్థాయిలో అవార్డులను గెలుచుకొన్నది. అయితే ఆస్కార్ వేదిక మీద ఈ పాటపై ఎన్టీఆర్, రాంచరణ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదని అభిమానుల్లో ఓ ప్రశ్న తలెత్తింది. అయితే ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రాంచరణ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదంటే?

ప్రేమ్ రక్షిత్, రాజమౌళి విజన్
నాటు నాటు పాట విషయానికి వస్తే.. ఆ పాటను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజన్ కారణం. ఆ పాటను డిజైన్ చేసిన విధానమే పక్కాగా ఉంది. రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నెల రోజులపాటు రిహార్సల్ చేసి స్టెప్పులను పర్ఫెక్ట్‌గా వేయడంతోనే ఆ పాట అంత జనరంజకంగా మారింది.

ప్రతికూల పరిస్థితుల మధ్య నాటు నాటు
ఇక కోవిడ్ పరిస్థితులు వెంటాడుతుండగా.. రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో కూడా నాటు నాటు పాట విషయంలో దర్శకుడు రాజమౌళి రాజీ పడలేదు. ప్రత్యేక విమానంలో ఉక్రెయిన్‌కు వెళ్లి.. టీమ్‌తో నాటు నాటు పాటను 17 రోజులపాటు చిత్రీకరించాడు. తాను అనుకొన్న విధంగా వచ్చేంత వరకు రాజమౌళి పాటను చిత్రీకరిస్తూనే ఉన్నారు.

విదేశీ డ్యాన్సర్లతో ఫెర్ఫార్మ్
ప్రపంచ సినీ అభిమానులను ఆకట్టుకొన్న నాటు నాటు పాటకు ఆస్కార్ వేదికపై ప్రదర్శించే అవకాశం దక్కింది. అయితే ఈ పాటపై విదేశీ డ్యాన్సర్లతోపాటు.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ మాత్రమే చేశారు. అయితే ఎన్టీఆర్, రాంచరణ్ ఎందుకు డ్యాన్స్ చేయలేదని అభిమానులు అనుకొన్నారు. అందుకు కారణం ఏమిటంటే?.

ప్రేమ రక్షిత్‌కు ఆలస్యంగా వీసా
నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అమెరికా వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. వీసా మంజూరు కాకపోవడంతో ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆస్కార్ వేదికపై రిహార్సల్ విషయంలో జాప్యం జరిగింది. దాంతో పాట రిహార్సల్ కోసం సమయం తక్కువైంది అని ప్రేమ్ రక్షిత్ చెప్పారు.

బిజీ షెడ్యూల్ కారణంగా
అయితే ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు ఎన్టీఆర్, రాంచరణ్ డ్యాన్స్ చేయాల్సి ఉంది. కానీ వారికి ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా వారు రిహార్సల్ చేయలేకపోయారు. దాంతో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, విదేశీ డ్యాన్సర్లతో నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు.


Click it and Unblock the Notifications











