RC16 ఏఆర్ రెహ్మాన్‌ను వెంటాడుతున్న ఫ్లాపుల సెంటిమెంట్.. రాంచరణ్‌కు బ్లాక్‌బస్టర్ అందిస్తాడా?

తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లకు పెద్ద పీట ఉంటుంది. కాంబినేషన్లు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలు, బ్యానర్లు ఇలాంటి విషయాలను చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఎవరైనా చేసిన సినిమా ఫ్లాప్ అయితే వారి జోలికి వెళ్లడానికి ఆమడదూరంలో ఉంటారు. సక్సెస్ ఇచ్చిన వాళ్ల వెంట పడటమే కాకుండా రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్లు ఇచ్చి సినిమాలు చేస్తుంటారు. ఇదంతా ఎందుకు చెప్పడమంటే..

ఏఆర్ రెహ్మాన్ అంటే సంగీత ప్రపంచంలో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. క్యాసెట్స్ నుంచి, సీడీలు, ప్రస్తుతం యూట్యూబ్ కాలం వరకు ఆయన పాటలు మార్మోగుతుంటాయి. ఓ దశలో ఆయనతో సినిమాలు చేయించుకోవడానికి తంటాలు పడ్డారు.

Will AR Rahman overcome Flops Sentiment to give blackbuster for Ram Charan s RC16 in Telugu

అయితే ఏఆర్ రెహ్మన్ తన మ్యూజిక్‌తో బాలీవుడ్, హాలీవుడ్‌ను కూడా మెప్పించారు. ఆయన సంగీతం అందించిన హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ఆయన చేసిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు లభించింది. మ్యూజిక్ రంగంలో అకాడమీ అవార్డు సాధించిన వ్యక్తిగా రికార్డు బ్రేక్ చేశారు.

అయితే ఇంతటి మ్యూజిక్ మాంత్రికుడు చాలా తక్కువగా తెలుగు సినిమాలు చేశారు. అయితే తెలుగులో చేసిన సినిమాలు కూడా పెద్దగా ఆడకలేకపోవడం పక్కన పెడితే.. డిజాస్టర్లుగా నిలిచాయి. ఏఆర్ రెహ్మాన్ తెలుగులో స్ట్రేయిట్‌గా మ్యూజిక్ అందించిన సినిమా వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ హీరోగా చేసిన గ్యాంగ్ మాస్టర్, మహేష్ బాబు నటించిన నాని, విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ పోలీస్, రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన పల్నాటి పౌరుషం, పవన్ కల్యాణ్ నటించిన కొమురం పులి సినిమాలకు మ్యూజిక్ అందించారు. అయితే ఈ సినిమాలు దాదాపు ఫ్లాపులుగా నిలిచాయి.

Will AR Rahman overcome Flops Sentiment to give blackbuster for Ram Charan s RC16 in Telugu

తెలుగు సినిమా పరిశ్రమకు చాలాకాలంగా ఏఆర్ రెహ్మన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా రాంచరణ్, జాన్వీ కపూర్ నటించిన RC16 సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఆయన ట్రాక్ రికార్డు చూసిన మెగా అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. తన ట్రాక్ రికార్డును బ్రేక్ చేసి.. రాంచరణ్‌కు బ్లాక్ బస్టర్ అందిస్తాడా అనే విషయంపై వారిలో చర్చ జరుగుతున్నది.

ఇదిలా ఉండగా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలో రాంచరణ్, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుకుమార్ తదితరులు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవి ప్రకాశ్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు రెహ్మన్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X