సాహో అప్‌డేట్.. ఏ చోట నువ్వున్నా ఫుల్ సాంగ్.. ఈ ఏడాదంతా గిలిగింతలే మరి
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా 'సాహూ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం ఇన్వాల్వ్ అయింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. తాజాగా సాహో నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది. ''ఏ చోట నువ్వున్నా'' అంటూ లవ్ ట్రాక్‌లో సాగిపోతున్న ఈ పాటలో ప్రభాస్- శ్రద్ద రొమాంటిక్, లొకేషన్స్, మ్యూజిక్ హైలైట్ అవుతున్నాయి. కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ పై హరి చరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాడిన ఈ పాటకు గురు రంధావా సంగీతం అందించారు. సాహో అంటే కేవలం యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా మాత్రమే కాదు రొమాటిక్ మూడ్ కూడా ఉంటుందని ఈ సాంగ్ ద్వారా నిరూపించారు.

కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాటను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఈ ఏడాదంతా ఏ చోట నువ్వున్నా సాంగ్ మీ హృదయాలను హత్తుకుంటుంది అని ట్యాగ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసింది. ఇక ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత రాబోతున్న సినిమా కావడంతో 'సాహూ' పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. హై టెక్నీకల్ వాల్యూస్‌తో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా సాహోకి సంబందించిన అప్‌డేట్స్ విడుదల చేస్తున్నారు యూనిట్ సభ్యులు.


Click it and Unblock the Notifications











