2021 Telugu Best Songs: ఈ ఏడాది రికార్డులు క్రియేట్ చేసిన పాటలివే.. టాప్‌ లేపేసిన స్పెషల్ సాంగ్

గత ఏడాదితో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఆడియెన్స్ మెప్పును పొంది సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఎన్నో సరికొత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. అదే సమయంలో కొన్ని పాటలు కూడా శ్రోతల ఆదరాభిమానాలను అందుకుని సత్తా చాటాయి. తద్వారా యూట్యూబ్‌లో అదిరిపోయే ఘనతలను అందుకున్నాయి. ఇక, ఈ ఏడాది చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో 2021లో తెలుగులో విడుదలై.. సూపర్ హిట్ అయిన పాటల గురించి తెలుసుకుందాం పదండి. ఇందులో ఒక సినిమాకు చెందిన పాటలే ఎక్కువగా ఉన్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!

టాప్ లేపేసిన సమంత స్పెషల్ సాంగ్

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత 'ఊ అంటావా మావ.. ఊఉ అంటావా' అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాయగా.. ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. ఈ సాంగ్‌కు 24 గంటల్లోనే 12.39 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

రెండో స్థానంలో పవన్ పవర్‌ఫుల్ సాంగ్

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ లిరికల్ వీడియోకు 24 గంటల్లోనే 10.20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది రెండో స్థానంలో ఉంది. థమన్ స్వరపరిచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇదే సాంగ్ రెండోసారి విడుదలైనప్పుడు 8.28 మిలియన్ వ్యూస్ అందుకుంది.

మూడు నాలుగు స్థానాలు పుష్పరాజ్‌వే

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీ నుంచి వచ్చిన అన్ని పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో సామీ సామీ అంటూ సాగే పాట 24 గంటల్లోనే 9.06 మిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో నిలిచింది. అలాగే, దాక్కోదాక్కో మేక అనే పాట 8.32 మిలియన్ వ్యూస్‌తో నాలుగో స్థానంలో ఉంది. వేరే భాషల్లో కూడా ఈ పాటు దుమ్ము దులిపేశాయి.

RRR మాస్ బీట్ కూడా దుమ్ములేపింది

టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఈ మూవీ నుంచి ఆ మధ్య 'నాటు నాటు' అంటూ సాగే ఓ మాస్ బీట్ విడుదలైంది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను చంద్రబోస్ రాయగా.. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించాడు. దీనికి 24 గంటల్లోనే 7.36 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పాట ఎక్కువ వ్యూస్ అందుకున్న జాబితాలో ఆరో స్థానంలో ఉంది.

ఏడు, తొమ్మిది స్థానాల్లో కూడా పుష్పదే

పుష్ప మూవీ నుంచి విడుదలైన అన్ని పాటలూ యూట్యూబ్‌లో దుమ్ముదులిపేశాయి. ఇప్పటికే ఈ సినిమా సాంగ్ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు శ్రీవల్లి అంటూ సాగే మెలోడీ సాంగ్ 6.98 మిలియన్ వ్యూస్‌తో ఏడో ర్యాంక్‌లో ఉంది. అలాగే, ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే పాట 6.57 మిలియన్ వ్యూస్‌తో 9వ స్థానంలో ఉంది. ఇలా ఈ సినిమా పాటలే టాప్ 9లో నిలిచాయి.

తర్వాతి స్థానాల్లో కూడా ఆ సినిమాలవే

పైన పేర్కొన్న పాటలతో పాటు ఈ ఏడాది విడుదలైన వాటిలో RRR మూవీలోని జనని అనే సాంగ్‌కు 24 గంటల్లో 6.58 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రభాస్ 'రాధే శ్యామ్'లోని ఈ రాతలే సాంగ్ 6.31 మిలియన్ వ్యూస్‌తో పదో స్థానంలో ఉంది. అలాగే, RRRలోని దోస్తీ సాంగ్ 6.16 మిలియన్ వ్యూస్‌తో పదకొండవ స్థానంలో కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X