Yo Yo Honey Singh గృహ హింస కేసు విచారణ.. భార్య శాలిని భోరున ఏడుస్తూ కోర్టులో కుప్పకూలి..

టాప్ సింగర్, ర్యాప్ స్టార్ యోయో హానీ సింగ్ దాంపత్య జీవితం ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. ఆయన భార్య షాలిని తల్వార్ సింగ్ తన భర్తపై గృహ హింస చట్టం కింద తీస్ హజరీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తీస్ హాజరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నేపథ్యంలో శాలిని తల్వార్ భోరున కోర్టు రూమ్‌లో విలపించడం అందర్నీ కలిచివేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

Yo Yo Honey Singhs wife Shalini Talwar broke down in a Tis Hazari courtroom

హానీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ ఫిర్యాదు చేస్తూ తనను గృహ హింసకు గురిచేస్తున్నాడు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడు. కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ కొద్ది రోజుల క్రితం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో హానీ సింగ్‌పై ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తీస్ హాజరీలోని మిస్ తానియా సింగ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌లో కేసు నమోదైంది. హానీ సింగ్ భార్య షాలిని తరఫున సందీప్ కపూర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

తీస్ హజారీ కోర్టు రూమ్‌లో విచారిస్తుండగా.. తన వాదనను కోర్టుకు వినిపిస్తూ తన బాధలను భావోద్వేగానికి లోనయ్యారు. గత పదేళ్లుగా నా భర్త వేధింపులను తట్టుకొన్నాను. ఏ పరిస్థితుల్లోనే ఆయనను తాను కించపరచలేదు. ప్రతీ విషయంలో అతడికి అండగా ఉన్నాను. కానీ హాని సింగ్ తన జీవితాన్ని సర్వనాశనం చేశాడు అని కన్నీటిపర్యంతమైంది.

హానీ సింగ్ భార్య శాలిని తల్వార్‌కు ఉపశమనం కలిగే విధంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కోర్టు నుంచి మీరు ఏం కోరుకొంటున్నారు. మీ దాంపత్య జీవితం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైనా కోర్టు సానుకూలంగా ఆదేశిస్తే.. కుదురుకొనే పరిస్థితి ఉందా? మీ మధ్య ప్రేమ దూరమై.. అఘాతం ఎందుకు నెలకొన్నది అని అడిగారు. అయితే ఈ విచారణ సమయంలో శాలిని కొన్ని వీడియో, ఆడియో సాక్ష్యాలను తన లాయర్‌తోపాటు న్యాయమూర్తి ముందుంచింది. దాంతో దాంపత్య జీవిత వ్యవహారాన్ని సెటిల్ చేయాల్సిన అవసరముందనే అభిప్రాయానికి వచ్చారు.

అయితే హానీ సింగ్ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే కోర్టు హాజరుకాలేదని ఆయన తరుఫు న్యాయవాది ఇషాన్ ముఖర్జీ వెల్లడించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరవ్వకుండా హానీ సింగ్ ముఖం చాటేయడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయన తన తరఫున పిటిషన్ దాఖలు చేయకపోవడం, అలాగే మెడికల్ రికార్డులు అందజేయకపోవడం, అలాగే ఆదాయానికి సంబంధించిన అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంతో కొంత మేరకు కోర్టు సీరియస్ అయింది. దాంతో తదుపరి విచారణ సమయంలో హానీ సింగ్ కోర్టుకు హాజరు అవుతారని చెప్పి భరోసా ఇవ్వడంతో న్యాయమూర్తి శాంతించారు. అంతేకాకుండా హానీ సింగ్ ఆదాయానికి సంబంధించిన టాక్స్ రిటర్న్స్, మెడికల్ రిపోర్టులు దాఖలు చేయాలని ఆదేశించింది.

అయితే హానీ సింగ్‌ను సెప్టెంబర్ 3వ తేదీన జరిగే విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కానీ తమ క్లయింట్‌ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన తరఫు లాయర్ కోర్టును కోరింది. అయితే శాలిని తల్వార్ ఇప్పటికే విలువైన వస్తువులు, ఆభరణాలు తీసుకెళ్లింది అని తెలియజేస్తూ హానీ సింగ్ లాయర్ పిటిషన్ దాఖలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X