Yo Yo Honey Singh ఒకేసారి అనేక మంది మహిళలతో శృంగారం.. యో యో హానీసింగ్‌పై భార్య తీవ్ర ఆరోపణలు

అద్బుతమైన మ్యూజిక్ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న గాయకుల్లో యోయో హానీ సింగ్ ఒకరు. కొద్దికాలంగా ఆయన మ్యూజిక్ ప్రపంచానికి దూరం కావడం అభిమానులను బాధించింది. అయితే ప్రస్తుతం మానసిక సమస్యలతోనే కాకుండా వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఆయన ప్రతిష్ట మసకబారే విధంగా మారుతున్నాయి. తాజాగా యో యో హానీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

2011లో షాలిని కౌర్‌తో పెళ్లి

2011లో షాలిని కౌర్‌తో పెళ్లి

ప్రముఖ ర్యాపర్, గాయకుడు, సంగీత దర్శకుడు హానీ సింగ్ వివాహం షాలినీ తల్వార్‌తో 2011లో ఢిల్లీలోని గురుద్వారాలో జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే భర్తపై షాలిని తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. పెళ్లికి ముందున్న రిలేషన్స్‌ను దాచి పెట్టాడని ఆరోపించింది. అలాగే మాదక ద్రవ్యాలు ఉయోగించి వేధింపులకు పాల్పడుతాడు. తనతో పెళ్లికి ముందే పంజాబీ నటితో అఫైర్ ఉందని షాలిని ఆరోపించింది.

గృహ హింసకు పాల్పడుతున్నాడని

గృహ హింసకు పాల్పడుతున్నాడని

కొద్ది రోజుల క్రితం యో యో హానీ సింగ్‌పై భార్య షాలిని తల్వార్ ఫిర్యాదు చేస్తూ తనను గృహ హింసకు గురిచేస్తున్నాడు. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడు. కట్నం కోసం వేధిస్తున్నాడు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దాంతో హానీ సింగ్‌పై ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తీస్ హాజరీలోని మిస్ తానియా సింగ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌లో కేసు నమోదైంది.

118 పేజీల పిటిషన్ దాఖలు

118 పేజీల పిటిషన్ దాఖలు

హానీ సింగ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా తీవ్ర ఆరోపణలు చేస్తూ భార్య షాలిని తరఫున సందీప్ కపూర్ అనే న్యాయవాది 118 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. యో యో హానీ సింగ్ వేధింపులకు పాల్పడినట్టుగా సాక్ష్యాలను కోర్టుకు అందించారు. ఇక ఈ కేసులో గాయకుడికి నోటీసులు జారీ చేసి ఆగస్టు 28వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఈ కేసు మరింత జటిలమైంది.

చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు

చాలా మంది మహిళలతో అక్రమ సంబంధాలు

హానీ సింగ్‌పై దాఖలు చేసిన ఫిర్యాదులో న్యాయవాది ఆరోపిస్తూ ఆయనకు చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. పలువురితో శృంగార జీవితాన్ని పంచుకొంటున్నారు. హానీ సింగ్‌ను ఈ విషయంపై ప్రశ్నిస్తే దారుణంగా ఆయన, ఆయన కుటుంబం హింసించారు. మాటలు, చేతలతో దాడికి పాల్పడ్డారు. మానసికంగా తనను క్షోభకు గురిచేశారు అని భార్య షాలిని తల్వార్ ఫిర్యాదు చేసింది

వివాహేతర రిలేషన్స్‌తో శృంగారం

వివాహేతర రిలేషన్స్‌తో శృంగారం

హానీ సింగ్‌పై భార్య షాలిని చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఒకే సమయంలో పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని సెక్స్‌లో పాల్గొంటారు. విదేశాలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి చేష్టలకు పాల్పడుతారు. తనకు ఫెళ్లి జరిగిందని విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడడు. వివాహేతర సంంధాలు, శృంగార కార్యకలాపాలను సీక్రెట్‌గా కొనసాగిస్తుంటాడు అని హానీ సింగ్ భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.

10 కోట్ల భరణం చెల్లించాలని

10 కోట్ల భరణం చెల్లించాలని

తనను మానసికంగా వేధించినందుకు హానీ సింగ్‌ నుంచి నష్టపరిహారం అందించాలని తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. తనను జంతువుకంటే హీనంగా చూసి వేధించాడు. అందుకు తన భర్త హానీ సింగ్ నుంచి 10 కోట్ల పరిహారాన్ని అందించేలా ఆదేశాలు ఇవ్వాలని తన ఫిర్యాదులో కోర్టును భార్య షాలిని కౌర్ కోరింది. అంతేకాకుండా తాను హానీ సింగ్‌ తల్లితో కలిసి ఉండలేను. ఢిల్లీలో తాను వేరే చోట ఉండేందుకు సకల సదుపాయాలు ఉన్న ఇంటి కోసం రూ.5 లక్షలు చెల్లించాలని కూడా డిమాండ్ చేసింది.

Recommended Video

#YoSonakshiSoDumb | Sonakshi Sinha Trolled For Not Knowing Ramayana
స్పందించని హానీ సింగ్

స్పందించని హానీ సింగ్

అయితే తనపై వచ్చిన ఫిర్యాదులపై యో యో హానీ సింగ్ స్పందించలేదు. అయితే ఆగస్టు 28వ తేదీన హానీ సింగ్ ఎలాంటి సమాధానం ఇస్తారనే విషయం ఆసక్తిగా మారింది. భార్య చేసిన ఆరోపణలపై హానీ సింగ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పోతే హానీ సింగ్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. పాగల్‌పంతి, ఛలాంగ్, ముంబై సాగా చిత్రాలకు మ్యూజిక్ అందిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X