హైదరాబాద్‌లో సరిగమప ఆడిషన్స్.. 23వ తేదీన ఎక్కడ నిర్వహిస్తున్నారంటే?

ప్రముఖ ఛానెల్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిన జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు 2005 మే 18న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతీవారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తున్నది. జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్‌గా మారింది.

ZEELs Sarigamapa the Singing Super Star auditions at Hyderabad

విలక్షణమైన స్టోరీలైన్స్‌తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను జీ తెలుగు అందిస్తున్నది. సమతూకంగా ఉండే కంటెంట్‌తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్‌గా కొనసాగుతోంది.

జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమవుతున్నది. అయితే ఎంతో ప్రేక్షకాదరణ ఉన్న సరిగమప సరికొత్త సీజన్‌ కోసం ముస్తాబువుతున్నది.

మ్యూజికల్ రియాలిటీ షో సరిగమప సరికొత్త సీజన్ ఇప్పటికే 13 సీజన్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నది. మరోసారి అందరిని సరిగమలలో ఆకట్టుకొనేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విజయనగరం, ఖమ్మం, విశాఖపట్నం, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి , తిరుపతి, కరీంనగర్, విజయవాడ మరియు కర్నూల్‌లో ఆడిషన్స్ పూర్తి చేసుకుంది. 2000 పైగా మంది ఆడిషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ నెల 23 నుంచి ఆడిషన్స్ జరుగనున్నాయి. ఈ ఆడిషన్స్‌కు హాజరుకావాలనుకొనే వారు 16 - 35 వయసు వారు అయితే ఈ పోటీలో పాల్గొనవచ్చు.

హైదరాబాద్‌లో డిసెంబర్ 23, గురువారం, పద్మాలయ స్టూడియోస్, రోడ్ నెంబర్ 78, జెమినీ లాబ్స్ ప్రక్కన, జూబ్లీహిల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X