విధ్వంసం సృష్టిస్తున్న వీరరాఘవ.. దూసుకుపోతోన్న ఊరమాస్ టీజర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ విధ్వంసం మొదలైంది. కొద్దీ సేపటిక్రితమే విడుదలైన అరవింద సమేత టీజర్ ఫాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ఎప్పటిలాగే యూట్యూబ్ రికార్డుల వేట మొదలైంది. సెలవు దినం కావడం, ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈ టీజర్ కోసం ఎదురుచూస్తుండడంతో మిలియన్ల కొద్దీ వ్యూస్ మొదలయ్యాయి. గత కొన్ని చిత్రాల వరకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అందించిన త్రివిక్రమ్.. అరవింద సమేత చిత్రంతో రాయలసీమ నేపథ్యంలో ఊర మాస్ కంటెంట్ తో రాబోతున్నాడు.
Recommended Video


గంటలోపే
అరవింద సమేత టీజర్ కేవలం గంటలోపే 1. 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇది నిజంగా విధ్వంసమే. ఎన్టీఆర్ మాస్ డైలాగ్స్, త్రివిక్రమ్ టేకింగ్ అదిరిపోవడంతో టీజర్ సోషల్ మీడియాని దున్నేస్తోంది.

తొలిసారి త్రివిక్రమ్
పక్కా మాస్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కించడం దర్శకుడు త్రివిక్రమ్ కు ఇది తొలి సారి అని చెప్పొచ్చు. త్రివిక్రమ్ గత చిత్రాల్లో కూడా యాక్షన్ ఉంది. కానీ ఈ స్థాయిలో ఊరమాస్ ఎలిమెంట్స్ తో భీభత్సం సృష్టించేలా త్రివిక్రమ్ ఎప్పుడూ సినిమా తీయలేదు.

రాయలసీమ యాస
ఈ చిత్రంలో త్రివిక్రమ్ తన పెన్నుకు మరింత పదును పెడుతూ రాయలసీమ డైలాగ్స్ రాసి అదే యాసలో ఎన్టీఆర్ చేత పలికించాడు. నరికేస్తానబ్బా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ మరో లెవల్ లో ఉంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నటీనటులు
ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇషా రెబ్బ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











