ఫ్యాన్ క్లబ్‌లోకి కోటి మంది, ఆదీ ఆయన రేంజి!

By Bojja Kumar

 1 cr people to join Illayaraja's fan club
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేరుతో తొలి అఫీషియల్ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు కాబోతోంది. ఏప్రిల్ 5న తమిళనాడులోని మధురైలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాన్ క్లబ్‌లో చేరే వారి సంఖ్య 10 మిలియన్లు(కోటి) దాటబోతోందని ఈ ఫ్యాన్ క్లబ్ ట్రస్టీల్లో ఒకరైన వేలుస్వామి తెలిపారు. ఇందులో వందలాది సింగర్లు కూడా మెంబర్లుగా ఉండబోతున్నారని వెల్లడించారు.

ఇళయరాజా పెద్ద కుమారుడైన కార్తీక్ రాజా ఈ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేసారు. అదే విధంగా ఆయన చైర్మన్ హోదాలో ఈ ఫ్యాన్ క్లబ్‌లో సేవలు అందించబోతున్నారు. ఇళయారాజా అభిమానులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఆయన ఈ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రభుత్వంచే రిజిస్టర్ చేయబడిన ఫ్యాన్ క్లబ్.

వందలాది మంది సింగ్లు కూడా ఈ ఫ్యాన్ క్లబ్ లో చేరడానికి తమ పేరు నమోదు చేసుకున్నారు. వందలాది చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఇళయరాజా ఎంతో మంది సంగీత ప్రపంచంలోకి రావడానికి ఆదర్శంగా నిలిచారు. సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సాధారణ ఫ్యాన్ క్లబ్‌ల మాదిరి....ఇళయారాజా పేరుతో వివిధ సందర్బాలను సెలబ్రేట్ చేయడం తమ ఉద్దేశ్యం కానే కాదని, ఈ ఫ్యాన్ క్లబ్ పూర్తి స్థాయిలో తమిళనాడు వ్యాప్తంగా సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోబోతందని తెలుస్తోంది. ఏప్రిల్ 5న ఈ ఫ్యాన్ క్లబ్ అపీషియల్‌గా ప్రారంభం కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X