మహేష్ ‘1’ ఆడియో రిలీజ్ షో టిక్కెట్ రేట్ అంతా?
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన '1'(నేనొక్కడినే) చిత్రం ఆడియో ఈ నెల 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు ఉండే భారీ ఫ్యాన్ ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయడంతో పాటు...కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలోకూడా అభిమానుల కోసం లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు.
థియేటర్లలో మహేష్ బాబు '1' ఆడియో వేడుక చూడాలనుకునే వారు రూ. 250 చెల్లించాలని తెలుస్తోంది. వీరికి టికెట్‌తో పాటు ఉచితంగా టీషర్టు, క్యాప్, క్యాలెంటర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసారట. టిక్కెట్లు ఎక్కడ అమ్ముతారు? ఏయే థియేటర్లలో ఈ ఆడియో వేడుక ప్రసారం అవుతుంది? అనేది విషయాలు త్వరలో తెలియనున్నాయి.

14 రీల్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. హేష్‌కి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.


Click it and Unblock the Notifications











