‘1 నేనొక్కడినే’ఆడియో పంక్షన్ విశేషాలు -1 (ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ రూపొందించిన వన్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శిల్పకళా వేదికలో జరిగింది.
కార్యక్రమంలో ఆడియోను మాస్టర్ గౌతం విడుదల చేసి మొదటి సిడిని సుకుమార్ కు అందజేశారు.

నన్ను ఎంతో అభిమానిస్తున్న మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి. మేము చేయాల్సింది అంతా చేశాము మిగతాది మీరు చూసుకోవాలి జనవరి 10 న పండుగ బాగా చేసుకుందాము అన్నారు.

కార్యక్రమంలో సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్ ఈ సినిమాకు పని చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము అని మహేష్ బాబు అన్నారు.

ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ఒక్కో పాటను ఒక ప్రత్యేక తరహాలో విడుదల చేయడమే కాకుండా ఆ పాటలకు ప్రముఖ డాన్స్ గ్రూప్ లతో డాన్స్ లు వేయించారు. కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. నాలుగు వందల స్కూళ్ళలో జరిగిన వన్ సినిమాపై జరిగిన ఈ వెంట్ లో గెలుపొందిన పలువురు విద్యార్థులు మహేష్ బాబు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

ఆడియో పంక్షన్ విశేషాలు...

వస్తూంటే...

వస్తూంటే...

మహేష్ తన భార్య పిల్లాడుతో వస్తూంటే అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. వారిని కంట్రోలు చేసి ..మహేష్ ని,ఫ్యామిలీని లోపలకి జాగ్రత్తగా తీసుకురావటం నిర్వాహకులకు కష్టమైపోయింది.

విభిన్నంగా...

విభిన్నంగా...

ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ఒక్కో పాటను ఒక ప్రత్యేక తరహాలో విడుదల చేయడమే కాకుండా ఆ పాటలకు ప్రముఖ డాన్స్ గ్రూప్ లతో డాన్స్ లు వేయించారు. కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది.

ఎవరి చేతులు మీదుగా...ఎవరు?

ఎవరి చేతులు మీదుగా...ఎవరు?

‘1 నేనొక్కడినే' ఆడియో సీడీని మహేష్‌ తనయుడు గౌతమ్‌ కృష్ణ విడుదల చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల అందుకున్నారు.

ఎదురుచూసాం...

ఎదురుచూసాం...

దూకుడు తరువాత వారితో పని చేయడం ఆనందంగా ఉంది. వాళ్ళు నా ఫేవరేట్ ప్రొడ్యూసర్స్.తరువాత సినిమా ఆగడు కూడా వారితో చేస్తాను. వారితో పని చేయడం సొంత వాళ్ళతో పని చేసినంత ఆనందంగా ఉంది.వాళ్ళు ఖర్చకు వెనకాడ కుండా చేశారు. ఆనందమైన రోజు ఈ రోజు కోసం ఎదురు చూశాము. ఈ సందర్భంగా దేవికి థాంక్స్ చెప్పాలి. నేను దేవి చాలా సార్లు కలిశాము. సినిమా చేయాలనుకున్నాము ఎందుకో కుదరలేదు. సుకుమార్ కాంబినేషన్ లో చేయడం ఆనందంగా ఉంది. మా దర్శకుడు సుకుమార్ వన్ స్టోరి సినిమా బాగా తీశాడు. నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా అవుతుంది.

దేవిశ్రీప్రసాద్

దేవిశ్రీప్రసాద్

ఈ పంక్షన్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన దేవిశ్రీప్రసాద్... చిత్రం ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మహేష్ ...దేవిని చాలా సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. దేవి ఈ పంక్షన్ లో చాలా ఉత్సాహంగా వెలిగిపోయారు.

అందరి దృష్టీ...

అందరి దృష్టీ...

ఈ కార్యక్రమంలో అందరి దృష్టీ ..ఈ చిత్రంలో మహేష్ సరసన చేసిన కృతి సనన్ పైనే ఉండిపోయింది. మహేష్ సరసన చేసిన ఆమె గ్లామర్ ని అంచనా వేస్తూ ఉండిపోయారు.

సుకుమార్ ప్రతిభ

సుకుమార్ ప్రతిభ

తన కెరీర్ లో మొదటి నుంచి క్రియేటివికి ప్రాధానమిస్తూ వరసగా చిత్రాలూ చేస్తూ వస్తున్న సుకుమార్..ఈ చిత్రంలో ఏం వైవిధ్యం చూపించాడు అనేది ఈ ఆడియో పంక్షన్ లో హాట్ టాపిక్ అయ్యింది. సైక్లాజికల్ థ్రిల్లర్ అనే విషయం అందరూ చర్చించుకోవటం కనిపించింది. అలాగే సుకుమార్ వేదికమీదకు రాగానే విపరీతమైన స్పందన వచ్చింది.

స్పెషల్

స్పెషల్

ఈ ఆడియో పంక్షన్ లో మరో స్పెషల్... సింగర్ Nehabasin పాట. ఆమె డాన్స్ చేస్తూ మరీ ఈ పాటని స్టేజిపై పాడి అందరినీ అలరించింది. ఆమె అందచందాలు అందరినీ ఆకర్షించాయి.

చంద్రబోస్ మాట్లాడుతూ...

చంద్రబోస్ మాట్లాడుతూ...



ఇందులో మంచి సాహిత్యం రాశాను. హుఆర్ యు అనే పాటలో మంచిఫోర్స్ ఉన్న పదాలు పడ్డాయి. మంచి సాహత్యం రాయించిన దర్శకుడు సుకుమార్ కు సంగీత దర్శకుడు దేవిశ్రీ గారికి మహేష్ బాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

శ్రీకాంత్ అడ్డాల సైతం...

శ్రీకాంత్ అడ్డాల సైతం...

మహేష్ తో ఇంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల ని మహేష్ చాలా సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. ఆయన ఈ పంక్షన్ ని బాగా ఎంజాయ్ చేసారు. ఆయన గతంలో సుకుమార్ అశోసియేట్ కావటం విశేషం

వీరంతా...

వీరంతా...

చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్‌స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్‌బాబు, లహరి మ్యూజిక్ మనోహర్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాత,మనవళ్లు...

తాత,మనవళ్లు...

సూపర్ స్టార్ కృష్ణ గారు తన మనవడుతో చాలా సేపు ముచ్చటిస్తూ..సరదాగా జోక్స్ వేస్తూ...ఎంజాయ్ చేస్తూ కనపడ్డారు. మహేష్ కుమారుడు అయిన గౌతమ్ కి తన తాతగారి వద్ద బాగా చనువు ఎక్కువ..ఇద్దరు కలిసి ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X