»   » ఊహకు అందని విధంగా మహేష్ పాత్ర

ఊహకు అందని విధంగా మహేష్ పాత్ర

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : స్టార్ హీరోలు చిత్రాలు వస్తున్నాయంటే అందులో హీరో ఎలా కనపడనున్నారు...కథేంటి..అతని పాత్రేంటి అన్న ఉత్సుకత అందరిలో కలగటం సహజం. మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ట్యాగ్ లైన్. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. 14రీల్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని క్రాబీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఎవరూ ఊహించలేని విధంగాగా, చాలా డిఫెరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.


  నిర్మాత మాట్లాడుతూ...''యాక్షన్‌ తరహాలోసాగే వైవిధ్యమైన కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తెరకెక్కిస్తున్నారు. 27నుంచి బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరపతున్నాం'' అని అన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. గౌతమ్‌ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది.

  డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు. జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు.

  మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాజి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

  English summary
  Mahesh Babu’s upcoming movie “1-Nenokkadine” has completed its shooting in London long ago. As there was 10 days break for entire Indian movie shootings for the celebration of 100 years of Indian Cinema from 16th at Chennai. Here is the latest news is that the schedule of the movie moves from September 17th to September 27th in Bangkok. Sukumar is directing the film. Gopichand Achanta, Ram Achanta and Anil Sunkara is producing the film under 14 Reels Entertainment Banner. kriti Sanon is pairing up with Mahesh. Devi Sri Prasad is acoring the music and Ratnavelu is handling the Camera. The movie is getting ready for a massive release in January 2014.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more