ఆశ్చర్యం: టాప్ పొజిషన్లో మహేష్ ‘1’
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' మూవీ ఇంటర్నేషనల్ లెవల్లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈచిత్రం ఓవర్సీస్ మార్కెట్లో మంచి వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం IMDB టాప్ 5 హైయ్యెస్ట్ రేటెడ్ ఫీచర్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది.
ప్రముఖ హాలీవుడ్ సినిమాలు పోటీ పడ్డ ఈ జాబితాలో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం 9.2 రేటింగుతో 3వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి ఇంత రేటింగు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దీని తర్వాతి స్థానంలో హాలీవుడ్ మూవీ 'డార్క్ నైట్స్' చిత్రం నిలవడం గమనార్హం. 1వ స్థానంలో Redirected (2014), 2వ స్థానంలో Waar (2013), 3వ స్థానంలో 1 (2014), 4వ స్థానంలో The Dark Knight (2008), 5వ స్థానంలో Pulp Fiction (1994) నిలిచింది.
'1 నేనొక్కడినే' చిత్రం ఓపెనింగ్స్ కాస్త నిరాశ పరిచినప్పటికీ....మౌత్ టాక్ ద్వారా సినిమా క్రమక్రమంగా పుంజుకుంటోంది. IMDB రేటింగుపై దర్శకుడు సుకుమార్ స్పందిస్తూ....'ఈ చిత్రం తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని ఇంటర్నేషనల్ లెవల్‌కి తీసుకెళ్లిందని, సినిమా ఇంత బాగా రావడానికి టీం వర్కేకారణమని, టెక్నీషియన్స్ మంచి పనితీరు కనబర్చారని, మహేష్ బాబు నా స్క్రిప్టును నమ్మి ఓకే చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైందని' అన్నారు.
'1 నేనొక్కడినే' చిత్రాన్ని పాత్ బ్రేకింగ్ సినిమా పలువురు తెలుగు దర్శకులు ప్రశంసించారు. ఈచిత్రాన్ని పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి పంపించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా తెలుగు సినిమా ఖ్యాతి ఇంటర్నేషనల్‌గా చర్చనీయాంశం కానుంది.
తెలుగు నాట కమర్షియల్ అంశాలతో కూడిన కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ డ్రామాలు నడుస్తున్న తరుణంలో.......ఇక్కడ అంతగా పాపులారిటీ లేని సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీని మహేష్ బాబు ఎందుకు ఒప్పుకున్నాడు? అనే సందేహం చాలా మంది నుండి వ్యక్తం అవుతోంది.
ఈ ప్రశ్నలకు ఇటీవల ఇంటర్వ్యూలో మహేష్ బాబు సమాధానం ఇస్తూ....రొటీన్ స్టోరీలు కాకుండా కొత్తగా చేయాలనే ఆలోచనే ఇందుకు కారణం. ఇతర పరిశ్రమల వారు మన తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవాలి. అందుకే హాలీవుడ్ స్టాండర్ట్స్‌తో ఈ సినిమా చేసాం. ఈ చిత్రం నా కెరీర్లో ఒక మెమోరబుల్ సినిమా, కెరీర్లో ఒక మంచి సినిమా చేసాననే తృప్తి మిగిలింది' అన్నారు.


Click it and Unblock the Notifications












